గట్టి పిండం: 118 ఏళ్ల వయస్సులో గుండెకు శస్త్రచికిత్స: గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిందే

లూధియానా: ఆ వయోధిక వృద్ధురాలి పేరు కర్తార్ కౌర్ సంఘా. గత శతాబ్దం మొదట్లో పుట్టిందావిడ. 1901లో పంజాబ్ లో జన్మించారు. వయస్సు అక్షరాలా 118 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆమె గుండెకు శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు. గుండెకు పేస్ మేకర్ ను అమర్చారు. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు డాక్టర్లు ప్రకటించారు. పంజాబ్ లోని లూధియానాలోని ఓ ఆసుపత్రి ఈ అద్భత ఘట్టానికి వేదికైంది.

ఆపరేషన్ విజయవంతమైందని, కర్తార్ కౌర్ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. అక్కడితో ఆగలేదు. 118 సంవత్సరాల వయస్సున్న వృద్ధురాలి గుండెకు ఆపరేషన్ చేయడం మాటలు కాదని, ఈ అరుదైన ఘనతను తాము సాధించామని చెప్పుకొంటున్నారు. ఈ ఉదంతాన్ని గిన్నిస్ బుక్ లోకి, వీలు కాకపోతే కనీసం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలని కోరుతున్నారు.

Doctors successfully implant pacemaker on 118-year old Karta Kaur Sangha in Ludhiana

హృద్రోగ నిపుణుడు డాక్టర్ రవీందర్ సింగ్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. శస్త్రచికిత్స పూర్తయిన కొద్దిసేపటికే కర్తార్ కౌర్ మాట్లాడగులుగుతున్నారని అన్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన కుటుంబీకులను గుర్తు పడుతున్నారని, వారిని చిరునవ్వుతో పలకరిస్తున్నారని చెప్పారు.

Doctors successfully implant pacemaker on 118-year old Karta Kaur Sangha in Ludhiana

శస్త్ర చికిత్స విజయవంతం చేసిన తమ బృందానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు చెబుతున్నారని డాక్టర్ రవీందర్ సింగ్ చెప్పారు. బామ్మ‌కు ఆ వ‌య‌సులో ఆప‌రేష‌న్ చేయ‌డాన్ని సవాల్ గా తీసుకని విజయవంతం చేశామని అన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ట్లు డాక్ట‌ర్లు తెలిపారు.

కర్తార్ కౌర్ వయస్సును నిర్దారించుకోవడానికి డాక్టర్లు ఓ చిన్న ప్రయత్నం చేశారు. ఆమె సోదరుడి జనన ధృవీకరణ పత్రాన్ని పరిశీలించారు. ఆయన 1903లో జన్మించినట్లు తేలింది. కర్తార్ కౌర్ కుమార్తె వయస్సు 90 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె జీవించే ఉన్నారని డాక్టర్లు నిర్ధారించుకున్నారు. ఆమె వయస్సును ధృవీకరించుకున్న తరువాతే తాము గిన్నిస్ బుక్ రికార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+