తొలిసారి జగన్ బాటలో మోడీ ? ఐదు రాష్ట్రాల ఎన్నికలతో మొదలు ! ఫలిస్తే దేశవ్యాప్తంగా..

దేశంలో ఐదు కీలక రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ తో పాటు బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, త్రిపుర, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటికే ఏపీలో జగన్ విజయవంతంగా అమలు చేస్తున్న ఓ ఫార్ములాను బీజేపీ ఫాలో అవుతోంది.

ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో బీజేపీ ఈ ఫార్ములాను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. దీని ప్రకారం ఎన్నికల్లో కేవలం మోడీని చూసి ఓటేయాలని, అభ్యర్ధులను చూసి కాదని బీజేపీ చెబుతోంది. అంతే కాదు ఈ రాష్ట్రాల్లో ఇప్పటివరకూ అనుసరిస్తున్న ముఖ్యమంత్రుల్ని ముందుగా ప్రకటించే విధానానికి సైతం చరమగీతం పాడేస్తోంది. ముఖ్యమంత్రి ఎవరో తెలియకుండానే కేవలం ప్రధాని మోడీని చూసి బీజేపీని గెలిపించాలని కోరుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నాలుగైదు పేర్లు ప్రచారంలో ఉంటున్నాయి.

does pm modi follows ys jagan successful formula in five state polls ?

రాజస్తాన్ లో బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే సింధియా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర ఉంది. అలాగే ఛత్తీస్ ఘడ్ లో రమణ్ సింగ్ అయితే బీజేపీని మూడుసార్లు అధికారంలోకి తెచ్చారు. అయినా ఇప్పుడు వీరికి ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ లేదు. ముధ్యప్రదేశ్ లో ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు టికెట్ గ్యారంటీ కూడా లేదు. రేపు బీజేపీ గెలిస్తే సీఎం పదవికి పోటీ పడేలా నలుగురు కేంద్రమంత్రుల్ని అక్కడ ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతోంది. తెలంగాణలోనూ కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ ఇలా ఎవరు సీఎం అవుతారో తెలియని పరిస్దితి.

వాస్తవానికి ఈ ఫార్ములాను ఏపీలో వైఎస్ జగన్ స్ధానిక సంస్ధల్లో ఇప్పటికే విజయవంతంగా అమలు చేసేశారు. గతంలో స్ధానిక ఎన్నికలతో పాటు పలు ఉపఎన్నికల్లోనూ జగన్ ఫొటో చూసి ఓటేయాలనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చి విజయవంతం అయ్యారు. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నికల్లో సైతం జగన్ పాదయాత్ర ప్రభావంతో వైసీపీ అధికారంలోకి రావడాన్ని బట్టి చూస్తే ఇదెంత బలంగా ప్రభావం చూపుతోందో అర్ధమవుతుంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో సైతం జగన్ ను చూసి ఓటేయాలనేలా రాజకీయాన్ని మార్చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా ఐదు రాష్ట్రాల్లో అదే చేయబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+