క్యాట్ వాక్ ఓకే.. "డాగ్ వాక్" చూశారా..! నెట్టింట్లో వైరల్

ముంబై : క్యాట్ వాక్ తెలుసు గానీ ఈ డాగ్ వాక్ ఏంటనుకుంటున్నారా? వయ్యారాలు ఒలకబోస్తూ నడిచే అందాల భామల క్యాట్ వాక్ గురించి విన్నాం గానీ డాగ్ వాక్ గురించి ఎన్నడూ వినలేదుగా. ముంబైలో జరిగిన క్యాట్ వాక్ కార్యక్రమంలో ఓ కుక్క సందడి చేసింది. ర్యాంపు మీద మోడల్స్ వయ్యారాలు ఒలకబోస్తున్న సందర్భంలో ఆకస్మాత్తుగా కుక్క దర్శనమిచ్చింది. దీంతో క్యాట్ వాక్ కవరేజీలో మునిగిపోయిన ఫోటోగ్రాఫర్లు కాస్తా కుక్క మీద దృష్టి పెట్టారు. దాన్ని అక్కడినుంచి పంపించే క్రమంలో ర్యాంప్ మీదుగా నడుస్తూ కిందకు వెళ్లింది. అచ్చంగా క్యాట్ వాక్ చేసే రీతిలో ర్యాంప్ పై అది నడుచుకుంటూ వెళ్లిన తీరు అక్కడున్నవారిని ఆకర్షించింది.

dog came into fashion show, viral in social media

ప్రముఖ డిజైనర్ రోహిత్ బాల్ ఫ్యాషన్ షో లో ఈ ఘటన చోటుచేసుకుంది. బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ పేరుతో నిర్వహించిన క్యాట్ వాక్ కార్యక్రమంలో డాగ్ ప్రత్యక్షమైంది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా, నటి డయానా పెంటీ ఈ షో లో పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర మోడల్స్ ర్యాంప్ వాక్ పై నడవడానికి సిద్ధమైన తరుణంలో తాను సైతమంటూ శునకం అక్కడకు చేరుకుంది. అనుకోని ఈ ఘటనకు అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. మోడల్స్ సరసన కుక్క చేరడంతో ఫన్నీ సీన్ క్రియేటయింది. మొత్తానికి దాన్ని అక్కడినుంచి పంపించేసి ఫ్యాషన్ షో కంటిన్యూ చేశారు నిర్వాహకులు. కొన్ని రోజుల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా నెట్టింట్లో వైరలయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+