ముంబైలో చిరుతకు చుక్కలు చూపిన కుక్క (వీడియో)
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బోరివాలి ప్రాంతంలోని ఓ భవనంలోని వారికి ఓ పెట్ డాగ్ హీరోగా మారింది. దానిని పెంపుడు కుక్క తరిమింది. ఈ వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఆ చిరుతపులి ఆహారం కోసం వచ్చింది. ఆ కుక్క అరుపులతో బెంబేలెత్తించింది. కుక్క అరుపులకు చిరుత తోక ముడవక తప్పలేదు. కుక్క అరుపులకే చిరుత గోడ దూకి పారిపోయింది. ఆ ప్రాంతంలోకి గురువారం రాత్రి ఆ చిరుత ప్రవేశించింది.
ఆహారం కోసం ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్లింది. అయితే ఇంటి పెంపుడు కుక్క చిరుతను చూసి అరిచింది. అరుస్తున్న కుక్కపై దాడి చేసేందుకు చిరుత శతవిధాలా ప్రయత్నించింది. కానీ కుక్క ఓ బోనులో ఉంది. చిరుతకు సాధ్యం కాలేదు. చిరుత పలుమార్లు దాని పైన దాడికి యత్నించింది. కానీ కుదరలేదు.
దీంతో, ఆ చిరుత గోడ దూకి పారిపోయింది. ఇది అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. చిరుత సంచారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలోకి చిరుత పలుమార్లు వచ్చిందని, ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications