ఐటీఐ హాల్‌టికెట్: తన ఫోటోకు బదులు కుక్క ఫోటో..!
కోల్‌కత్తా: ఐటీఐ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఓ విద్యార్ధి హాల్ టికెట్‌ను డౌన్ చేసుకోగానే కంగుతిన్నాడు. అందుకు కారణం తన ఫోటోకు బదులు కుక్క ఫోటో రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో ఆదివారం వెలుగు చూసింది. మిడ్నాపూర్‌కు చెందిన సౌమ్యదీప్ మహాతో (18) అనే విద్యార్ధి ఈ ఏడాది పదో తరగతి పాస్ అయ్యాడు. అనంతరం ఐటీఐ ప్రవేశపరీక్ష కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు.

ఆదివారం హాల్ టికెట్‌ను డౌన్ లౌడ్ చేసుకోగానే అందులో తన ఫోటోకు బదులు కుక్క ఫోటో కనిపించడంతో వెంటనే తన ప్రాంతంలోని నోడల్ అధికారని కలిశాడు. సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని అధికారులు సర్దిచెప్పి, సౌమ్యదీప్ మహాతోకు మరో హాల్ టికెట్ ఇచ్చారు.
అనంతరం వెబ్‌సైట్ నుంచి కుక్క ఫోటో ఉన్న హాల్ టికెట్‌ను తొలగించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు నోడల్ అధికారి వెల్లడించారు.












Click it and Unblock the Notifications