సీఎంకు సెల్యూట్ చేసిన కుక్క, నవ్వుతూ అప్ప ప్రతినమస్కారం, సూపర్!

బెంగళూరు: తన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసిన వెంటనే శ్వాన దళం ( పోలీసు జాగిలం)కు చెందిన శునకం (కుక్క) ఒక్క సారిగా సెల్యూట్ చేసింది. విషయం గుర్తించిన సీఎం సైతం ఆసక్తిగా ఆ శునకం చూపించిన గౌరవానికి పరవసించి పోయి అక్కడే ప్రతినమస్కారం చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో ప్రచారం చెయ్యడానికి బయలుదేరారు. బుధవారం ఉదయం సీఎం యడియూరప్ప తన మద్దతుదారులతో కలిసి బెళగావిలోని టూరిస్టు గెస్ట్ హౌస్ చేరుకున్నారు.

బెళగావిలోని సర్కిట్ హౌస్ లో బసచేసిన సీఎం యడియూరప్ప ఉదయం వాకింగ్ చెయ్యడానికి మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలో బెళగావి సర్కిట్ హౌస్ దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సెక్యూరిటీ గార్డులతో పాటు పోలీసు జాగిలాలు, శ్వాన దళం సిబ్బంది అక్కడే ఉన్నారు.

Dog Soni salute Karnataka CM BS Yediyurappa in Belagavi

వాకింగ్ చేస్తూ వస్తున్న సీఎం యడియూరప్పకు పోలీసు జాగిలం, శ్వాన దళంలోని సోనీ అనే కుక్క ఒక్కసారిగా తల నేలకు ఆనించి, తోక ఊపుతూ సెల్యూట్ చేసింది. విషయం గుర్తించిన సీఎం యడియూరప్ప, అక్కడ ఉన్న వారు శునకం చేసిన గౌరవ వందనంకు షాక్ అయ్యారు.

వెంటనే శునకం సోనీ దగ్గరకు వెళ్లిన సీఎం బీఎస్. యడియూరప్ప ఒక్క నిమిషం అక్కడే నిలబడిపోయారు శునకం సోనీకి నవ్వుతూ ప్రతి నమస్కారం చేసిన సీఎం యడియూరప్ప శ్వానదళం సిబ్బందితో ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+