చిరుత నోటి నుంచి తప్పించుకున్న టామీ, బతుకుజీవుడా అంటూ పరుగు..

రెప్పపాటులో ప్రాణాలతో బయటపడొచ్చు. అదీ ప్రమాదం అంచుల వరకు వెళ్లొచ్చినట్టు ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఓకే.. అలాగే క్రూర మృగాల బారి నుంచి బయటపడటం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. కర్ణాటకలో ఓ శునకం.. ప్రాణాల అంచువరకు వెళ్లి వచ్చింది. చిరుతపులి నోటి నుంచి జారిపోయి.. బతుకుజీవుడా అంటూ పరుగెత్తింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

భూమిపై నూకలు ఉన్నాయ్..

భూమిపై నూకలు ఉన్నాయ్..

చిరుతపులి నోటికి చిక్కిన ఓ శునకం అదృష్టం బాగుంది. లేదంటే నోటి వరకు వెళ్లి మరీ బయటపడటం అంటే మామూలు విషయం కాదు. కర్ణాటకలోని మంగళూరులో పదుకొంజేకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి ఉంటున్నారు. ఆయన ముద్‌బిద్రీ అనే అటవీ ప్రాంత పరిధిలో ఉంటున్నాడు. టామీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. గత గురువారం అర్థరాత్రి అడవిలో నుంచి ఓ చిరుతపులి సతీష్‌ ఇంటి వద్దకు వచ్చింది. ఇంటి బయట నిద్రపోతున్న టామీ గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.

అదృష్టం బాగుంది..

అదృష్టం బాగుంది..

కానీ టామీ అదృష్టం బాగుంది. చిరుతపులి నోటినుంచి తృటిలో తప్పించుకుంది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. చిరుతపులి దాని వెంట పరిగెత్తకుండా అక్కడే ఉండి పోయింది. దీంతో కుక్క ప్రాణాలతో హమ్మయ్యా అంటూ బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ ఆ శునకానికి మాత్రం భూమిపై నూకలు ఉన్నాయి. లేదంటే చావు అంచు వరకు వెళ్లి మరీ తిరిగి రావడం అంటే చిన్న విషయమేమీ కాదు.

జారలేదు.. ఇక అంతే

జారలేదు.. ఇక అంతే


ఆ చిరుత నోటి నుంచి టామీ జారకున్నా.. పరుగెత్తుకు రాకున్నా అంతే పని. చిరుత జారవిడిచిందో లేదో.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మరీ పరుగు తీసింది. ఆ చిరుత కూడా తాను శునకంతో పోటీ పడలేను అనుకుందో ఏమో.. అక్కడ మిన్నకుండిపోయింది. దీంతో టామీకి బతికే అవకాశం కలిగింది. లేదంటే చిరుత చేతిలో ఇప్పటికే ఖతం అయి ఉండేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+