మరిన్ని డోక్లాం లాంటి సమస్యలు ముందున్నాయి: చైనా కుట్రలపై ఆర్మీ చీఫ్
చైనా కుట్రలపై భారత ఆర్మీ చీఫ్ స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యాలు చేశారు.
న్యూఢిల్లీ: చైనా కుట్రలపై భారత ఆర్మీ చీఫ్ స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను మరింతగా పెంచడమే లక్ష్యంగా చైనా ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తోందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యాలు చేశారు. డోక్లాం తరహా పరిస్థితిని మరిన్ని ప్రాంతాల్లో కల్పించాలన్న ఉద్దేశంతో సైన్యాలను బార్డర్‌లోకి పంపుతోందని అన్నారు.
భవిష్యత్తులో ఇరు దేశాల మధ్యా డోక్లాం పీఠభూమిలో ఏర్పడినటువంటి సమస్యలు రానున్నాయని తాను భావిస్తున్నట్టు ఆయన అన్నారు. వాస్తవాధీన రేఖ వెంటబడి చైనా సైన్యం మోహరించివుందని గుర్తు చేసిన ఆయన, వెంటనే తన సైన్యాన్ని చైనా వెనక్కు తీసుకోవాలన్నారు.

సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్చలు ప్రారంభించేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అన్నారు. రెండు దేశాల సైన్యమూ వెనక్కు తగ్గేందుకు సిద్ధంగా లేదని చెప్పిన ఆయన, సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు ఎదుటి దేశపు సైన్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉందని అన్నారు.
దేశ రక్షణ విభాగం, స్ట్రాటజిక్ స్టడీస్ ఆఫ్ సావిత్రీ బాయ్ పూలే పుణె వర్శిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇరు దేశాల సైన్యాలూ ఒకేసారి వెనక్కు వెళ్లాలన్నదే తమ అభిమతమని రావత్ వ్యాఖ్యానించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications