చిన్నారి పెళ్లి కూతురు ప్రత్యూష మృతి, షారుక్ ఖాన్ స్పందన
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య పైన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ స్పందించాడు. ప్రత్యూష మృతికి ఆయన సంతాపం తెలిపాడు. అదే సమయంలో అవకాశాలు దొరకనప్పటికీ నటీనటులు అసంతృప్తికి లోనుకావొద్దని హితవు పలికారు.
జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నిరాశకు లోను కావొద్దని, విజయ సాధన దిశలో ఎటువంటి ఫలితాలొచ్చినా బాధ పడొద్దని చెప్పారు. జీవితంలో మంచి, చెడు రెండింటికీ ఆస్కారం ఉంటుందన్నారు. మీరు చేసిన కృషి వల్లే నేడు మీరు ఈ స్థాయిలో ఉన్నారని, ఎదురయ్యే ఆటుపోట్ల గురించి బాధపడకూడదన్నారు.

చేతిలో పని లేనప్పుడు నిరాశ చెందకూడదని, ప్రతిభ ఉంటే పని ఎప్పటికయినా లభిస్తుందన్నారు. తాను డ్యూయల్ రోల్ చేసిన 'ఫ్యాన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా షారుక్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
నిజ జీవితంలో నాకు నేను అభిమానిని కాదని, నాకు నేను నచ్చనని, ఒకవేళ అలా జరిగితే సినిమాల్లో తన పాత్రలో నేను జీవించలేనని, హీరో షారుఖ్‌లా నటిస్తానని చెప్పారు. అందుకే నన్ను నేను ఇష్టపడనని వ్యాఖ్యానించారు. అభిమానులు చూసినట్టు నా సినిమాలు నేను చూడనని, థియేటర్లోనే కాదు.. టీవీలో వచ్చినా చూడనని చెప్పారు. నా సినిమాలు నేను చూడటానికి ఇష్టపడనన్నారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications