గుజరాత్ గాడిదలకు ప్రచారం కల్పించకండి: అఖిలేష్ వివాదస్పద వ్యాఖ్యలు

'గుజరాత్ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉంది. అందులో నటించిన గొప్ప బాలీవుడ్ నటుడు(అమితాబ్ బచ్చన్)కి నాదొక విన్నపం. గుజరాత్ గాడిదలకు ప్రచారం కల్పించకండి' అంటూ అఖిలేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సీఎం అఖిలేష్ యాదవ్ బీజేపీపై ఘాటైన విమర్శలు చేశారు. గుజరాత్ గాడిదలకు ప్రచారం ఆపేయండంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది.

'గుజరాత్ గాడిదల కోసం ఓ వాణిజ్య ప్రకటన ఉంది. అందులో నటించిన గొప్ప బాలీవుడ్ నటుడు(అమితాబ్ బచ్చన్)కి నాదొక విన్నపం. గుజరాత్ గాడిదలకు ప్రచారం కల్పించకండి' అంటూ అఖిలేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Don't promote Gujarat's asses: Akhilesh Yadav to Bollywood's greatest actor

కాగా, బాలీవుడ్ స్టార్ అమితాబ్ గుజరాత్ టూరిజంకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో వణ్యమృగ ప్రాణుల సంరక్షణతోపాటు పర్యాటనకు ఆహ్వానిస్తూ అమితాబ్ ఆ ప్రకటనలో నటించారు. ఆ జంతువుల్లో గాడిదలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ మోడీని ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ వివరణ ఇచ్చుకున్నారు. గుజరాత్ ఆస్తులకు బచ్చన్ ప్రచారం కల్పించవద్దని చెప్పడమే తన ఉద్దేశ్యం అని అన్నారు. ఇదిలా ఉంటే, అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ కూడా సమాజ్ వాదీ సభ్యురాలు అన్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+