దయచేసి నన్ను చూసి నవ్వొద్దు: పళనికి స్టాలిన్ సూచన, ఎందుకంటే..?
ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామికి దయచేసి తనను చూసి అసెంబ్లీలో నవ్వొద్దని వ్యాఖ్యానించారు స్టాలిన్. అది ఎంతమాత్రం ఆయన పదవికి మంచిది కాదని పేర్కొన్నారు
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నేత ఎంకే స్టాలిన్ శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామికి దయచేసి తనను చూసి అసెంబ్లీలో నవ్వొద్దని వ్యాఖ్యానించారు స్టాలిన్. అది ఎంతమాత్రం ఆయన పదవికి మంచిది కాదని పేర్కొన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతకుముందు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. బెంగళూరు జైలు నుంచి సలహాలు, సూచనలు పాటించకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పన్నీర్ సెల్వం, డీఎంకే నేత స్టాలిన్ పరస్పరం నవ్వుతూ కనిపించారని, వారిద్దరూ నవ్వడం వల్లే లోపల ఏదో కుట్ర జరుగుతోందని భావించిన శశికళ పన్నీర్‌సెల్వాన్ని సీఎం పదవి నుంచి తప్పించారని ప్రచారం జరిగింది. ఈ అంశాన్నే మరోసారి ప్రస్తావిస్తూ స్టాలిన్ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications