వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ర్యాపిడ్ టెస్ట్ కిట్లను 2 రోజులు వాడొద్దు..కేవలం 5.4శాతం కచ్చితత్వం..రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై కేంద్రం కీలక సూచనలు చేసింది. రెండు రోజుల పాటు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించవద్దని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కిట్లలో లోపాలు ఉన్నాయని పలు రాష్ట్రాలు కేంద్రం దృష్టికి తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) నిపుణులను ఫీల్డ్‌కి పంపిస్తున్నామని.. ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరును వారు పరిశీలిస్తారని వెల్లడించింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 5లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ఒకవేళ కిట్ల పనితీరులో లోపాలు నిజమే అయితే.. వీటన్నింటిని తిప్పి పంపించే అవకాశం లేకపోలేదు.

రాజస్తాన్‌.. ర్యాపిడ్ టెస్టుల్లో కేవలం 5శాతం కచ్చితత్వం..

రాజస్తాన్‌.. ర్యాపిడ్ టెస్టుల్లో కేవలం 5శాతం కచ్చితత్వం..

మంగళవారం (ఏప్రిల్ 21) రాజస్తాన్ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను ఉపయోగించడం ఆపేసింది. ఈ కిట్లు దాదాపు 90శాతం మేర కచ్చితమైన ఫలితాలనిస్తాయని ఆశించామని.. కానీ కేవలం 5.4శాతం మేర మాత్రమే ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ తెలిపారు. దీంతో ఈ కిట్లతో ఎటువంటి ప్రయోజనం లేదని గుర్తించామన్నారు. కిట్ల కచ్చితత్వాన్ని పరిశీలించేందుకు ఇక్కడి సవాయి మన్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్,మైక్రోబయాలజీ విభాగాల అధిపతులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వారు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టుగా తెలిపారు. కమిటీ సూచన మేరకే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఉపయోగాన్ని నిలిపివేశామని.. దీనిపై ఐసీఎంఆర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు.

ఐసీఎంఆర్ ఆదేశాలు..

ఐసీఎంఆర్ ఆదేశాలు..


రాజస్తాన్ మాత్రమే కాదు మరో మూడు రాష్ట్రాల్లోనూ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సరైన ఫలితాలను ఇవ్వట్లేదని గుర్తించినట్టుగా ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ రమన్ గంగాఖేడ్కర్ తెలిపారు. రెండు రోజుల్లో ఐసీఎంఆర్ మెడికల్ టీమ్స్ ప్రతినిధులను రాష్ట్రాలకు పంపిస్తున్నామని.. టెస్టింగ్ కిట్ల కచ్చితత్వాన్ని వారు పరిశీలిస్తారని చెప్పారు. అప్పటివరకూ కిట్లను ఉపయోగించవద్దని అన్ని రాష్ట్రాలకు చెప్పామన్నారు. ఒకవేళ అన్ని కిట్లలోనూ ఇవే లోపాలు ఉంటే.. వీటిని తిప్పి పంపించి, లోపాలు లేని కిట్లను పంపించాల్సిందిగా కోరుతామన్నారు.

Recommended Video

Watch : Indian Origin Doctor In US Honored In Front Of Her House With A Parade
ఎందుకీ టెస్టులు..

ఎందుకీ టెస్టులు..

కరోనా వైరస్‌ను తట్టుకునే ప్రతిరోధకాలను శరీరం అభివృద్ది చేసుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ర్యాపిడ్ టెస్టుల ద్వారా రక్త నమూనాలను పరీక్షిస్తారు. యాంటీబాడీ టెస్టు చేయడం ద్వారా సదరు వ్యక్తి ఏ వైరస్ తో పోరాడుతున్నాడన్న విషయం తెలిసిపోతుంది. అయితే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ఫలితాలపై శాస్త్రవేత్తలు సైతం ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. 100శాతం కచ్చితమైన ఫలితాల కోసం ప్రపంచం మరో పరీక్షా విధానాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.

English summary
All states have been asked not to use the new rapid antibody test for COVID-19 for two days. The Indian Council Of Medical Research, the country's nodal body in the fight against coronavirus, which issued the order, said it would investigate the issue of faulty rapid testing kits and would "definitely not ignore this defect".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X