లైంగిక వేధింపులు: సీనియర్‌పై లేడీ లాయర్ ఆరోపణ

అతని వద్ద తాను కొంతకాలంపాటు సహాయకురాలిగా పని చేశానని ఆ సమయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడడంతో తన దగ్గర సహయకురాలి ఉండలేకపోయానని, ప్రస్తుతం అతన్నుంచి తాను దూరంగా ఉంటున్నానని ఆమె చెప్పింది. అతని వద్ద సహాయకురాలిగా పని చేయకపోయినప్పటికీ వేధింపులు ఆపలేదని ఆమె ఆరోపించారు. సెల్‌ఫోన్‌కు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడని ఆమె తెలిపింది.
ఆమె తన అనుభవాలను ‘లీగల్లీ ఇండియా' అనే వెబ్‌సైట్‌లో రాశారు. అయితే తాను రాసిన ఈ అంశంపై ఫిర్యాదు కావాలని కోరుకోవడం లేదని మిహిరా సూద్ వెల్లడించారు. అయితే ప్రజలు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించాల్సిన అవసరం ఉందని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. సూద్ ప్రస్తుతం కొలంబియా లా స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్నారు.
తొలిసారిగా తనపై జరిగిన వేధింపులను బహిరంగ పర్చిన తోటి న్యాయవాది బ్లాగును కూడా చదవడానికి ధైర్యం చేయలేదని సూద్ తెలిపారు. ఆమె వల్లే తాను ఈ విషయాలను బయటపెట్టానని సూద్ తెలిపారు. దీంతో తనకు కొంత ప్రశాంతత లభించిందని పేర్కొన్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన సీనియర్ న్యాయవాది గురించి ఈ విధంగా పేర్కొన్నారు.
ఆ న్యాయవాది తీరు తన పట్ల శృంగారపరమైన, లైంగిక వాంఛ భావాలతో ఉన్నట్టుండేదని ఆమె తెలిపారు. తన తండ్రి వయస్సులో ఉన్న అతడు తనపై ఉన్న లైంగిక వాంఛను వివిధ రకాలుగా తెలియజేసేవాడని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ సీనియర్ న్యాయవాదిపై కేసు కోరుకోవడం లేదని, తనలా చాలా మంది ఇలాంటి ఘటనలకు గురవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి మద్దతుగా నిలవాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications