పరీక్ష రాసేందుకు గాడిదకు హాల్ టిక్కెట్: 'పేపర్ లీకవుతుందని ఆందోళన!'
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌లో ఓ గాడిదకు పరీక్షా హాల్ టిక్కెట్ ఇచ్చారు. ఇది అందరినీ విస్తుగొలుపుతోంది. రాష్ట్రంలో తహసీల్దార్ ఉద్యోగాల కోసం త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. దీని కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారి హాల్ టికెట్లను జారీ చేశారు.
హాల్ టికెట్‌లో పేరు వద్ద కచౌర్ ఖర్ (గోధుమ వర్ణం గాడిద) అని ఉంది. అభ్యర్థి ఫొటో వద్ద గాడిద ఫొటో ఉంది. ఈ హాల్ టికెట్‌ను ఎవరు డౌన్ లోడ్ చేశారో తెలియదు. కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గాడిద పేరుతో పాటు ఫొటో కూడా ఉన్న హాల్ టికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ హాల్‌టికెట్‌పై అభ్యర్థి సంతకంతో పాటు జమ్ము కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు సెక్రటరీ సంతకం కూడా ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పొరబాట్లు జరుగుతున్నాయని కొందరు విమర్శించగా, మరికొందరు కంప్యూటర్ పొరబాటు అంటున్నారు.
ట్విట్టర్‌లో సెటైర్లు
గాడిదకు హాల్ టిక్కెట్ పైన పలువురు నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇందులో కొన్ని...
- హాల్‌టికెట్ ఐతే ఇచ్చారు గానీ మరి గాడిద పరీక్ష రాస్తుందా?
- పరీక్షా పేపర్ లీక్ అవుతుందేమోనని గాడిద ఆందోళన చెందుతోంది.
- క్యాండిడేట్ సంతకం కింద సంతకం ఎవరి చేశారో.. కానీ నేను ఆశ్చర్యపోయా!
- నేనూ పరీక్షలు రాయవచ్చా అని మరో జంతువు అడుగుతోంది.












Click it and Unblock the Notifications