తప్పుగా జింగ్‌పింగ్ పేరు, ఊడిన న్యూస్ రీడర్ ఉద్యోగం

ఈ విషయాన్ని ప్రసార భారతి చీఫ్ జవహర్ సర్కార్ స్వయంగా చెప్పారని వార్తలు వస్తున్నాయి. చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌లో తొలి జీని ఆంగ్లంలో ఎక్స్, ఐ అనే రెండు అక్షరాల సమాహారంగా రాస్తారు. రోమన్ అంకెల్లోని '11' కూడా ఈ రెండు అక్షరాల మాదిరిగానే ఉంటుంది.
దీంతో సదరు న్యూస్ రీడర్.. చైనా అధ్యక్షుడి పేరును ఎలెవెన్ జిన్ పింగ్‌గా ఉచ్చరించింది. దీంతో ఆమెకు ఉద్వాసన పలికారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని జవహర్ సర్కార్ చెప్పారు. అయితే, ఆమె క్యాజువల్ బేసిస్ ఉద్యోగి అని, ఆమెను కొన్ని నెలల పాటు తొలగించామని మరో అధికారి చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications