Doute: లవ్ మ్యారేజ్, భార్య తలుపు తీసినా, కిటికీలో చూసిన డౌట్, అర్దరాత్రి రూమ్ లో భర్త ఏం చేశాడంటే !
బెంగళూరు/ హాసన్: యువతి, యవకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు డిసైడ్ కావడంతో వారికి పెళ్లి చెయ్యడానికి పెద్దలు నిరాకరించారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు. రెండు సంత్సరాల తరువాత ఇరు వైపుల పెద్దలు రాజీ కావడంతో అప్పట్లో దంపతులు సంతోషించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. చిన్నగా మొదలైనా అనుమానం పెరిగి పెద్దదై అనుమానం పిచాచిలా తయారైయ్యింది. భార్య తలుపు తీసినా, కిటికీలో చూసినా రగిలిపోతున్న భర్త అతని భార్యను పట్టుకుని చితకబాదేస్తున్నాడు. చాలాకాలం నుంచి పెద్దలు పంచాయితీలు చేస్తున్నా భర్తలో ఏమాత్రం మార్పు రాలేదు. తన భర్త జీవితంలో మారడని, నేనే సర్చుకుపోవాలని దెబ్బలు ఓర్చుకుంటూ భార్య అక్కడే ఉంటూ కాపురం చేస్తోంది. రాత్రి నిద్రపోతున్న భార్యకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో నా భార్యకు మంటలు వ్యాపించాయని భర్త అందరినీ నమ్మించి ఆసుపత్రిలో చేర్పించాడు. 70 శాతం కాలిపోయిన భార్య రెండు రోజులు ఐసీయూలో చికిత్స పొందుతూ మూడో రోజు నోరు తెరచింది. తనకు గ్యాస్ సిలింర్ వలన మంటలు వ్యాపించలేదని, నా భర్త కిరోసిన్ పోసి నిప్పంటించాడని భార్య పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని చంపేయాలని అనుకుని నిప్పంటించానని భర్త అంగీకరించడంతో భార్య కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఒకే ఊరిలో లవర్స్
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని సకలేశపుర తాలుకాలోని మరడికెరె గ్రామంలో సతీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సతీష్ నివాసం ఉంటున్న గ్రామంలోనే భవ్యా (24) అనే యువతి నివాసం ఉంటున్నది. సతీష్, భవ్యా ఓకే ఊరి వాళ్లు కావడం, చిన్నప్పటి నుంచి పరిచయం ఉండటంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు
పెళ్లి చేసుకోవాలని ప్రేమికులు సతీష్, భవ్యా డిసైడ్ కావడంతో వారికి పెళ్లి చెయ్యడానికి ఇరు వైపుల పెద్దలు నిరాకరించారు. పెద్దలను ఎదిరించిన ప్రేమికులు సతీష్, భవ్యా ఐదు సంవత్సరాల క్రితం స్నేహితుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు. రెండు సంత్సరాల తరువాత ఇరు వైపుల పెద్దలు రాజీ కావడంతో అప్పట్లో సతీష్, భవ్యా దంపతులు సంతోషించారు.

భార్య మీద అనుమానం
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భవ్యా మీద ఆమె భర్త సతీష్ కు అనుమానం మొదలైయ్యింది. చిన్నగా మొదలైనా అనుమానం పెరిగి పెద్దదై అనుమానం పిచాచిలా తయారైయ్యింది. భార్య భవ్యా ఇంటి తలుపు తీసినా, ఇంట్లో నుంచి కిటికీలో బయటకు చూసినా రగిలిపోతున్న సతీష్ అతని భార్యను పట్టుకుని చితకబాదేస్తున్నాడు.

అర్దరాత్రి ఇంట్లో ఏం జరిగింది ?
చాలాకాలం నుంచి పెద్దలు పంచాయితీలు చేస్తున్నా భవ్యా భర్త సతీష్ లో ఏమాత్రం మార్పు రాలేదు. తన భర్త సతీష్ ఈ జీవితంలో మారడని, నేనే సర్చుకుపోవాలని దెబ్బలు ఓర్చుకుంటున్న భవ్యా భర్త ఇంట్లోనే ఉంటూ కాపురం చేస్తోంది. రాత్రి నిద్రపోతున్న భవ్యాకు మంటలు వ్యాపించాయి. గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో నా భార్య భవ్యాకు మంటలు వ్యాపించాయని ఆమె భర్త సతీష్ ఊరందరినీ నమ్మించి హాసన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు.

నా మొగుడే నిప్పంటించాడు
70 శాతం కాలిపోయిన భవ్యా రెండు రోజులు ఐసీయూలో చికిత్స పొందుతూ మూడో రోజు నోరు తెరచింది. తనకు గ్యాస్ సిలిండర్ వలన మంటలు వ్యాపించలేదని, నా భర్త సతీష్ నా మీద కిరోసిన్ పోసి నిప్పంటించాడని భవ్యా పోలీసులకు చెప్పడం కలకలం రేపింది. తాను ఏ తప్పు చెయ్యకపోయినా నా భర్త సతీష్ తన మీద అనుమానం పెంచుకున్నాడని భవ్యా పోలీసులకు చెప్పింది.
Recommended Video

అందుకే నా భార్యను చంపేయాలని అనుకున్నా
తన భార్య భవ్యా అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని, అందుకే ఆమెను చంపేయాలని అనుకుని కిరోసిన్ పోసి నిప్పంటించానని సతీష్ అంగీకరించడంతో భవ్యా కుటుంబ సభ్యులు హడలిపోయారు. భవ్యా పరిస్థితి విషమంగా ఉందని, సతీష్ ను అరెస్టు చేశామని సకలేశపుర తాలుకా పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications