షాకింగ్: పేకమేడలా కూలిన మూడంతస్తుల భవనం
పాట్నా: బీహార్‌లో ఓ భవంతి పేకమేడలా కూలిపోయింది. మూడు అంతస్తులు ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలిపోవడం వీడియోలో బంధించబడింది. ఈ సంఘటన బీహార్‌లోని షియోహర్ జిల్లాలో మంగళవారం నాడు చోటు చేసుకుంది.
ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ భవనం పేకమేడలా కూలిన సంఘటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జిల్లాలోని ఓ గ్రామంలో రైలు బోగీలా ఈ భవంతిని కట్టారు. ఇది మూడంతస్తుల భవనం. ఇది భారీ శబ్దం చేస్తూ కూలిపోయింది.

ఇది కుప్ప కూలడం కూలడం పక్కింటిపై పడింది. నిర్మాణ లోపాల కారణంగా ఈ భవనం కుప్పకూలిందని స్ధానికులు చెబుతున్నారు. భవనం కూలుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గాలికి ఊగినట్టు అటూఇటూ ఊగుతూ కుప్పకూలడం పేకమేడను గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications