డీఆర్డీఓ ఛైర్మన్‌ జీ సతీష్ రెడ్డి బదిలీ: తెలుగు తేజాన్ని ఏరి కోరి తెచ్చుకున్న కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఛైర్మన్ జీ సతీష్ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సమీర్ వీ కామత్‌ను నియమించింది. సతీష్ రెడ్డి ప్రస్తుతం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ విభాగం కార్యదర్శిగా, డీఆర్డీఓ ఛైర్మన్‌గా పని చేస్తోన్నారు. ఆ స్థానం నుంచి ఆయనను బదిలీ చేసి, సమీర్ వీ కామత్‌ను అపాయింట్ చేసింది.

సతీష్ రెడ్డిని మరో ప్రతిష్ఠాత్మక పోస్ట్‌కు బదిలీ చేసింది. రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించింది. రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై జీ సతీష్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. ఆయన సారథ్యంలో డీఆర్డీఓ ఓ వెలుగు వెలిగింది. అనేక కీలకమైన మిస్సైళ్లను డెవలప్‌ చేసింది. వాటిని అంతే విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీలో అత్యుత్తమంగా డీఆర్డీఓను తీర్చిదిద్దారాయన.

DRDO Chairman G Satheesh Reddy transferred and Samir V Kamat has appointed same post

మిస్సైల్స్, స్ట్రాటజిక్ సిస్టమ్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, అన్ మ్యాన్డ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్స్, అండర్ వాటర్, రాడార్, స్ట్రాటజిక్ మెటీరియల్స్, ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. నేవిగేషన్ టెక్నాలజీని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు. అగ్ని, పృథ్వీ, ఎల్ఎల్‌హెచ్, ఐఎన్ఎస్ షిప్స్, సబ్ మెరైన్ల కోసం నేవిగేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.

బాల్లిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను ఛేదించగల మిస్సైళ్లను ఆయన హయాంలోనే డీఆర్డీఓ డెవలప్ చేసింది. ఈ మధ్యే యాంటీ శాటిలైట్ మిస్సైల్ మిషన్ శక్తిని కూడా డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. డిఫెన్స్ టెక్నాలజీ మీద ఆయనకు ఉన్న గట్టి పట్టు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఆయనను తన సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమించుకున్నారు.

జీ సతీష్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. అనంతపురం, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీలో ఉన్నత చదువులు చదివారు. పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1986లో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యారు. 2018లో డీఆర్డీఓ ఛైర్మన్‌గా అపాయింట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+