తోటలో కుప్పకూలిన మానవరహిత విమానం రుస్తుం 2, డీఆర్ డీఓ డ్రోన్ పరీక్షిస్తుంటే!

బెంగళూరు: ప్రయోగం చేస్తున్న సమయంలో సంచరిస్తున్న మానవరహిత విమానం రుస్తుం 2 కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని చెళ్ళకెరె తాలుకాలోని జోడిచిక్కనహళ్ళి గ్రామం సమీపంలోని ఓ పోలంలో డీఆర్ డీఓ సంస్థకు చెందిన మానవరహిత విమానం కుప్పకూలిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు.

కుదాపురలో డీఆర్ డీఓ సంస్థ డ్రోన్ విమానాల ప్రయోగశాల ఉంది. అక్కడి నుంచి గాలిల్లోకి ఎగిరిన రుస్తుం 2 అనే మానవరహిత విమానం జోడిచిక్కనహళ్ళి గ్రామం సమీపంలో సాంకేతిక లోపంతో అదుపుతప్పి సమీపంలోని మంజునాథ్ అనే వ్యక్తి వక్కల తోటలో (పొలం)లో కుప్పకూలిపోయింది.

DRDOs pilot less drone Rustum 2 crashed on the outskirts of Jodhichikenahalli village in Karnataka

విమానం కూలిపోయిందని తెలుసుకున్న పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు వేల సంఖ్యలో మంజునాథ్ వక్కల తోట దగ్గరకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న డీఆర్ డీఓ సంస్థ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

చెళ్ళకెరె ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో (ఎటీఆర్)లో మానవ, మానవరహిత విమానాల ప్రయోగాత్మక శాలను డీఆర్ డీఓ సంస్థ నిర్వహిస్తోంది. ఎప్పటిలాగే మానవరహిత విమానం పరీక్షిస్తున్న సమయంలో సాంకేతిక లోపంతో ఆ విమానం కూలిపోయి ఉంటుందని పోలీసులు అంటున్నారు. మానవరహిత విమానం ఎలా కూలిపోయింది అని అధికారులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+