చావు బతుకుల్లో ఉన్నా.. కనికరం లేనితనం: ఆ డ్రైవర్ చేసిన పనికి అతను బలి..

తిరువనంతపురం: కేరళలోని త్రిశూర్‌లో దారుణం జరిగింది. సాటి మనిషి అన్న కణికరం లేకుండా ఓ అంబులెన్స్ డ్రైవర్ ఓ క్షతగాత్రుడి పట్ల నిర్దయగా వ్యవహరించాడు. అతని నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 20వ తేదీన పాలక్కడ్ జిల్లాలోని కొదక్కడ్ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై రోడ్డును క్రాస్ చేస్తున్న ఓ వ్యక్తి ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో పాలక్కడ్ లోని ఓ ఆసుపత్రికి అతన్ని తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం త్రిశూర్ తరలించే ఏర్పాట్లు చేశారు.

Driver puts Kerala man upside down for urinating in ambulance, he dies

అంబులెన్స్ లో అతన్ని త్రిశూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మార్గమధ్యలో అతను అందులోనే మలమూత్ర విసర్జన చేశాడు. దీంతో అతన్ని కిందకు దించే సమయంలో.. ఆ దుర్గంధాన్ని భరించలేక.. అంబులెన్స్ డ్రైవర్ స్ట్రెచర్ ను సగానికి దించి వదిలేశాడు. దీంతో తలకిందులుగా అయిపోయిన బాధితుడు తీవ్ర నొప్పితో బాధపడ్డాడు.

చివరకు ఆ ఆసుపత్రి సిబ్బంది అతన్ని గమనించి హుటాహుటిన లోపలికి తరలించారు. అనంతరం చికిత్స ప్రారంభించగా.. దురదృష్టవశాత్తు అతను ఈ శనివారం కన్నుమూశాడు.

అంబులెన్స్ డ్రైవర్ ఆ క్షతగాత్రున్ని స్ట్రెచర్‌పై వదిలేసి వెళ్లిన దృశ్యాలను ఎవరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అతని మృతికి కారణమైన అంబులెన్స్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+