వైజాగ్ టూ బెంగళూరు, పవర్ ఫుల్ బిజినెస్, పలుకుబడి ఉంటే రెఢీ !
బెంగళూరు/వైజాగ్: ఆంధ్రప్రదేశ్ లోని కొందరితో డీల్ పెట్టుకుంటే కోట్లలో డబ్బులు సంపాధించడానికి అవకాశం ఉంటుందని ఐటీ హబ్ లోని కొందరు అనుకున్నారు. అంతే రైలులో నేరుగా వైజాగ్ వెళ్లిపోయారు. వైజాగ్ లో మంచి పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తుల ద్వారా మరి కొందరిని పరిచయం చేసుకున్నారు. వైజాగ్ టూ బెంగళూరు అంటూ భలే బిజినెస్ చేస్తున్నారు.
అక్రమంగా గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన డ్రగ్స్ వ్యాపారిని బెంగళూరులోని కాటన్‌పేట పోలీస్‌స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం అరుకు ప్రాంతానికి చెందిన వెంకట సీతారామ్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని శనివారం బెంగళూరులోని కాటన్ పేట పోలీసులు తెలిపారు.

నిందితుడు వెంకట సీతారామ్ నుంచి రూ. 10 లక్షల విలువైన 20 కిలోలు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్రమంగా గంజాయిని బెంగళూరు నగరానికి రైలులో తీసుకొచ్చి తరువాత లోకల్ గా ఉన్న వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో నిందితుడు సీతారమ్ ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
నిందితుడు సీతారామ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రైలులో లగేజీలో గంజాయిని దాచి బెంగళూరు నగరానికి తీసుకువచ్చి గంజాయి చిరువ్యాపారులకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి అందిన పక్కా సమాచారం అందడంతో కాటన్ పేట పోలీస్ స్టేషన్ పోలీసులు క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వేస్టేషన్ వెనుక గేటులో బందోబస్తు నిర్వహించారు.

నిందితుడు సీతారామ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైలు దిగి లగేజ్ తో రైల్వే స్టేషన్ వెనుక గేటు వద్ద నిలబడి దిక్కులు చూస్తున్న సమయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సీతారామ్ లగేజ్ బ్యాగ్ లో గంజాయి కనపడటంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో తాను గంజాయి విక్రయిస్తున్నట్లు నిందితుడు సీతారామ్ అంగీకరించాడని పోలీసులు అన్నారు. కాటన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications