Drug case: గోవాలో ప్రత్యక్షం అయిన దీపికా పదుకొనే, ఎన్ సీబీ విచారణ తరువాత, మళ్లీ పిలుస్తారా?
ముంబాయి/ గోవా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడంతో అనేక మంది నటీనటుల తలరాతలుమారిపోయాయి. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేని ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. ఎన్ సీబీ అధికారుల విచారణకు హాజరైన తరువాత తనకు ఈ డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని దీపికా పదుకొనే మీడియాకు చెప్పింది. ఇంతకాలం ముంబాయిలోని ఇంటికే పరిమితం అయిన దీపికా పదుకొనే ఇప్పుడు గోవాలో ప్రత్యక్షం అయ్యింది.

దీపికా మీకు వాళ్లతో లింక్ ఉందా ? లేదా ?
బాలీవుడ్ డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి జైలుపాలైయ్యింది. బుధవారం రియా చక్రవర్తికి షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది. రియా చక్రవర్తి అరెస్టు తరువాత అనేక మంది బాలీవుడ్ స్టార్స్ ను NCB అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ‘పద్మావతి' దీపికా పదుకొనేని ముంబాయిలోని ఎన్ సీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు ఆమెను విచారణ చేశారు. డ్రగ్స్ సేవించే వాళ్లతో మీకు ఏమైనా లింక్ ఉందా ? లేదా ? అంటూ ఎన్ సీబీ అధికారులు దీపికా పదుకొనేని ప్రశ్నించారని వెలుగు చూసింది.

సార్.... నాకేం తెలీదు.... అంతే !
ముంబాయిలోని ఎన్ సీబీ కార్యాలయంలో అధికారులు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనేని సుమారు 5 గంటల పాటు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఎన్ సీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ దీపికా పదుకొనే ఆమె దగ్గర ఉన్న సమాధానం చెప్పిందని తెలిసింది. NCB అధికారుల విచారణ పూర్తి అయిన తరువాత మీడియాతో మాట్లాడిన దీపికా పదుకొనే డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదు... అంతే అంటూ సమాధానం ఇచ్చారు.

ముంబాయిలోని ఇంటికే మేడమ్ పరిమితం
ఎన్ సీబీ అధికారుల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయిన దీపికా పదుకొనే నేరుగా ముంబాయిలోని ఇంటికి వెళ్లారు. ఆ రోజు నుంచి దీపికా పదుకొనే ముంబాయిలోని ఇంటికే పరిమితం అయ్యింది. ఇదే డ్రగ్స్ కేసులో సారా ఆలీ ఖాన్, శ్రద్ద కపూర్ తదితరులను ఎన్ సీబీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

గోవాలో దీపికా ప్రత్యక్షం
బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎన్ సీబీ అధికారుల విచారణ తరువాత దీపికా పదుకొనే గోవాలో ప్రత్యక్షం అయ్యింది. ఇంతకాలం ముంబాయిలో ఉండిపోవడంతో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి దీపికా పదుకొనే గోవా చేరుకున్నారు. ఇంతకు ముందు గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు విచారణకు హాజరుకావాలని దీపికా పదుకొనేకి నోటీసులు ఇచ్చారు.
Recommended Video

మళ్లీ పిలుస్తారా ?
గోవాలో జరుగుతున్న షూటింగ్ మధ్యలోనే దీపికా పదుకొనే ముంబాయి వెళ్లిపోయింది. ఎన్ సీబీ అధికారుల విచారణ తరువాత దీపికా పదుకొనే షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. అయితే ఎన్ సీబీ అధికారులు మరోసారి దీపికా పదుకొనేని విచారణకు పిలుస్తారా ? లేదా ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications