Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: సెంట్రల్ జైల్లో సంజనా సైలెంట్, రాగిణి ఎస్ మేడమ్, సంజనా ప్రజెంట్ మేడమ్, నో సెల్ఫీ !

బెంగళూరు/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా సెంట్రల్ జైల్లో సైలెంట్ గా కాలం గడుపుతున్నారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కస్టడీ గడుపు పూర్తికావడంతో న్యాయస్థానం ఆదేశాలతో నటి సంజనాను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన స్యాండిల్ వుడ్ హనీ రాగిణి ద్వివేది ఇదే సెంట్రల్ జైల్లో ఉన్నారు. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన అనేక మంది నిందితులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోని వివిధ బ్యారెక్ లో ఉంటున్నారు. రాగిణి ఎస్ మేడమ్, సంజనా ప్రజెంట్ మేడమ్, వీరేన్ ఖన్నా ప్రజెంట్ సార్, రవిశంకర్ ఉన్నాన్ సార్ అంటూ జైలు అధికారుల ముందు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లు కాలం గడుపుతున్నారు.

 స్టేట్ హోమ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్

స్టేట్ హోమ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్

బెంగళూరు సిటీలోని సిద్దాపురలోని స్టేట్ హోమ్ లో నటి సంజనాను విచారణ చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 1వ ఏసీఎంఎం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. సంజనాకు డ్రగ్స్ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని నటి తరపు న్యాయవాది శ్రీనివాసరావ్ కోర్టుకు మనవి చేశారు.

 బెయిల్ ఇవ్వలేం.... జైలుకు పంపించండి

బెయిల్ ఇవ్వలేం.... జైలుకు పంపించండి

నటి సంజనాకు బెయిల్ ఇవ్వకూడదని ప్రభుత్వ న్యాయవాది, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు మనవి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నటి సంజనాకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. నటి సంజనాను ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ కు పంపించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. నటి సంజనా కేసు విచారణను బెంగళూరు 33వ సీసీహెచ్ న్యాయస్థానానికి బదిలీ చేశారు.

 డోంట్ వర్రి.... సంజనా సేఫ్ గా ఉన్నారు

డోంట్ వర్రి.... సంజనా సేఫ్ గా ఉన్నారు

బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నటి సంజనాను కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించారు. సంజనా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు నివేదిక ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో నటి సంజనాను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

 డ్రగ్స్ ఫ్రెండ్స్ కు అదే గతి

డ్రగ్స్ ఫ్రెండ్స్ కు అదే గతి

స్యాండిల్ వుడ్ బ్యూటీలు రాగిణి ద్వివేది, సంజనాతో పాటు డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన ప్రభుత్వ ఉద్యోగి రవిశంకర్, ప్రముఖ వ్యాపారి వీరేన్ ఖన్నాను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని బెంగళూరు 33వ సీసీహెచ్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రవిశంకర్, వీరేన్ ఖన్నాను పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.

 రాగిణి VS సంజనా

రాగిణి VS సంజనా

గతంలో ఓ పార్టీలో రాగిణి, సంజనాకు క్లాష్ అయ్యింది. అప్పటి నుంచి వీరిద్దరు ఎడముఖం పెడముఖం పెట్టుకుని మాట్లాడుకోవడం లేదు. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో రాగిణి, సంజనా సైతం ఒకరిని ఒకరు పలకరించుకోలేదని తెలిసింది. ఇప్పుడు రాగిణి, సంజనా పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో మాట్లాడుకుంటారా ? లేదా ? అనే విషయం వేచిచూడాలి.

Recommended Video

    COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
     రాగిణి ప్రజెంట్ మేడమ్.... సంజనా ఎస్ మేడమ్

    రాగిణి ప్రజెంట్ మేడమ్.... సంజనా ఎస్ మేడమ్

    పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో నటి రాగిణి, సంజనా దీనంగా ఉంటున్నారు. ఇంతకాలం వారి గ్లామర్ తో సినీ ప్రేక్షలను ఆకట్టుకుని ఎక్కడికి వెళ్లినా వెంటపడే అభిమానులకు ఫోటోలకు ఫోజులు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు ఇచ్చిన రాగిణి, సంజనా ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటూ రామభజన చేస్తున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసు పుణ్యమా అంటూ రాగిణి, సంజనా కలలో కూడా ఊహించిన జీవితం గడుపుతున్నారని పలువురు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+