కో అంటే కొకైన్, బ్లాక్‌బెర్రీ అంటే అమ్మాయి: ఇవీ డ్రగ్స్ నేరగాళ్ల కోడ్స్!
హైదరాబాద్: నగరంలో సోమవారం పట్టుబడిన నైజీరియన్ల ముఠా మాదకద్రవ్యాల కేసు దర్యాప్తులో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నైజీరియన్ నేరగాళ్ల దగ్గర దొరికిన డైరీలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

డ్రగ్స్ దందాతోపాటు వ్యభిచారం..
నైజీరియన్లు తమ డ్రగ్స్ కార్యకలాపాల నిర్వహణ క్రమంలో కోడ్(సంకేత) భాషను వినియోగించినట్లు తేలింది. డ్రగ్స్ విక్రయాలతోపాటు హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్ అమ్మాయిలతో వ్యభిచార దందాకు పాల్పడినట్లు తేలడంతో ఈసారి పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు.
Recommended Video


కోడ్ భాషలో..
నైజీరియన్ నేరగాళ్లు.. కొకైన్ కావాలంటే ‘కో' అని.. అమ్మాయి కావాలంటే ‘బ్లాక్‌బెర్రీ(బీబీ)'గా సంకేత నామాలు వాడినట్లు గుర్తించారు పోలీసులు. ఈక్రమంలో డైరీలోని విషయాల గురించి మరింత లోతుగా విచారించే పనిలో నిమగ్నమయ్యారు.

రేవ్ పార్టీల్లో వాడకం..
నైజీరియన్ల ముఠా దగ్గర పోలీసులు కొకైన్, బ్రౌన్‌షుగర్‌తోపాటు ఎంపిటమైన్ మాత్రల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపిటమైన్ మాత్రల్ని రేవ్‌పార్టీల్లో ఎక్కువగా వినియోగించేందుకు విక్రయించేవారని పోలీసులు గుర్తించారు.

లైంగికవాంఛ పెంచేవంటూ..
కాగా, ఈ డ్రగ్స్ లైంగిక వాంఛ పెంచుతాయని చెబుతూ వినియోగదారులకు అమ్మినట్లు నిందితులు వెల్లడించారు. గులాబీ రంగు మాత్రల్ని అమ్మాయిలకు, నీలం రంగు మాత్రల్ని అబ్బాయిల కోసం ప్రత్యేకంగా తయారు చేశారంటూ అంటగట్టేవారని దర్యాప్తులో తేలింది.

లోతుగా దర్యాప్తు...
గోవాలో గ్రాము కొకైన్ రూ.5 వేల లోపు లభ్యమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ నిషేధిత కొకైన్, బ్రౌన్‌షుగర్ ఉత్ప్రేరకాల్ని ఇక్కడ గ్రాముకు రూ.20 వేల చొప్పున విక్రయించడం ద్వారా ముఠా భారీఎత్తున డబ్బు పోగేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లెక్కన 4రెట్లు అధికంగా విక్రయించడం ద్వారా రూ.లక్షల్లో ఆర్జించారనేది పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల దగ్గర సుమారు రూ.2 లక్షలు మాత్రమే లభ్యం కావడంతో.. అక్రమార్జనను ఎప్పటికప్పుడు నైజీరియాకు పంపినట్లు భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..??












Click it and Unblock the Notifications