క్యాబ్ డ్రైవర్ల కిరాతకం: బాలికపై రేప్, హత్య, నదిలో పడేశారు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో క్యాబ్ డ్రైవర్లు మరో దారుణానికి తెగబడ్డారు. ఓలా క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు 12 ఏళ్ల బాలికను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దర్మార్గులు.. బాలికను ఊపిరాడకుండా చేసి చంశారు. మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడేశారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కుటుంబంతో కలిసి ఫుట్‌పాత్‌పై నివసిస్తున్న బాలికను బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాతంలో అపహరించారని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్లు బాలికపై పార్క్ సర్కస్ ఫ్లైఓవర్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడి తర్వాత చంపేసి బ్రిడ్జిపై నుంచి కిందపడేశారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications