స్కూటీని ఢీకొట్టి.. మహిళను ఈడ్చుకెళ్లిన వ్యాను: గగుర్పొడిచే వీడియో..
మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యాన్ డ్రైవర్.. రోడ్డుపై పెద్ద భీభత్సమే సృష్టించాడు. ఎదురుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో.. స్కూటీకి వ్యానుకు నడుమ మహిళ ఇరుక్కుపోయింది.
మౌంట్ అబూ: మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యాన్ డ్రైవర్.. రోడ్డుపై పెద్ద భీభత్సమే సృష్టించాడు. ఎదురుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో.. స్కూటీకి వ్యానుకు నడుమ మహిళ ఇరుక్కుపోయింది. అలా కొన్ని మీటర్ల వరకు వ్యాను ఆమెను ఈడ్చుకెళ్లింది. ఇంతలో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వ్యానుకు అడ్డుపడి మహిళను రక్షించారు.
రాజస్తాన్ లోని మౌంట్ అబూ ప్రాంతంలో బుధవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. తాగి వ్యానుతో రోడ్డెక్కిన ఓ వ్యక్తి.. స్కూటీపై వెళ్తున్న మహిళను నేరుగా ఢీకొట్టాడు. దీంతో వ్యాను చక్రాలకు స్కూటీకి మధ్య మహిళ నగిలిపోయింది. అలా 50మీటర్ల దూరం వరకు మహిళను వ్యాను లాక్కెళ్లింది. కొంతదూరం వెళ్లాక.. రోడ్డు పక్కన ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించారు.
#WATCH Mt Abu(Rajasthan):Drunk driver hits woman on scooty,drags both several meters before being stopped by ppl.Woman admitted to hospital pic.twitter.com/ADczX9yaXZ
— ANI (@ANI_news) June 28, 2017
హుటాహుటిన పరిగెత్తుకెళ్లి వ్యానును అడ్డుకున్నారు. ఆపై గాయాలపాలైన మహిళను ఆసుపత్రికి తరలించి.. డ్రైవ్ చేసిన వ్యక్తికి దేహశుద్ది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications