బాగా తాగి యువతి వీరంగం, స్టేషన్లో పోలీసులనే కొట్టింది (వీడియో)
ముంబై: ఓ యువతి తప్పతాగి పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ సృష్టించింది. తన స్నేహితులతో కలిసి హంగామా చేసింది. రాష్ డ్రైవింగులో పట్టుబడిన ఆ యువతిని, ఆమె స్నేహితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అక్కడ కూడా వీరంగం సృష్టించింది.
ఈ సంఘటడన ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ సృష్టిస్తోంది. వీడియోలో... ఆమె పోలీసులను కొడుతున్నట్లుగా ఉంది. కుర్చీ పైన కూర్చున్న ఓ పోలీస్‌ను తీవ్రంగా కొడుతున్నట్లుగా ఉంది.
ఆమెను కొందరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఒకరు ఆమెను బలవంతంగా పట్టుకొని ఆపే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన జూన్ 16వ తేదీన జరిగిందని తెలుస్తోంది. ఈ వీడియో ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు.












Click it and Unblock the Notifications