ఒళ్లు గగుర్పొడిచే ఘటన: మహిళను కారుతో ఢీ కొని, పైనుంచి పొనిచ్చిన ఘనుడు (వీడియో)
అవును.. ఆ డ్రైవర్ మత్తులోకి వెళ్లిపోయాడు. మందు తాగి డ్రైవింగ్ చేయొద్దు.. కానీ మనోడు కారును నడుపుతున్నాడు. రోడ్డుపై ఓ వృద్దురాలిని ఢీ కొన్నాడు. జనం రావడంతో మత్తు దిగినట్టుంది. కారును అలానే పోనిచ్చాడు. కారు కింద వృద్దురాలు అని కూడా చూడలేదు. కానీ స్థానికులు వెంబడించి పట్టుకోవడంతో.. అతను దొరికిపోయాడు. అయితే ఆ కారు ఓ పోలీసు అధికారిది కాగా.. అతను కారు డ్రైవర్.

ఇలా ప్రమాదం...
తూర్పు ఢిల్లీ ఘజిపూర్ చిల్లా గ్రామంలో శుక్రవారం రాత్రి కారు వస్తోంది. చిన్న గల్లీలో ఎదురుగా కారు రాగా.. మహిళ ఉంది. అయితే కారు ఢీ కొనగా.. జనం వచ్చారు. అందులో ఉన్న డ్రైవర్ పక్కకు పోనిస్తా అనుకొని, మహిళపై నుంచి కారు తీసుకెళ్లాడు. కానీ స్థానికులు వెంబడించారు. కారు ఢిల్లీకి చెందిన ఎస్సైది కాగా.. కారు నడుపుతుంది భాను అనే డ్రైవర్ అని పోలీసులు తెలిపారు.

మందు తాగి
కారు నడిపే సమయంలో భాను మద్యం సేవించాడని పోలీసులు తెలిపారు. ఘటన మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తోంది. బానెట్ తాకి పడిపోయిన మహిళ.. అలానే ఉండగా.. కారు పై నుంచి పోనిచ్చాడు. కానీ తర్వాత వారు కారును వెంబడించి పట్టుకొని.. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సైపై సెక్షన్ 279, 337 కింద కేసులు నమోదు చేశారు.
స్థిమితంగానే..
కారు వెళ్లాక వెంటనే వృద్దురాలని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఆమె కోలుకుంటున్నారు. కారు ప్రమాద దృశ్యాలు మాత్రం గగుర్పాటుకు గురిచేసింది. డ్రైవర్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడా అనే అనుమానం కలుగుతోంది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎస్సైపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications