మద్యం సేవించి బార్ మేనేజర్‌ను కాల్చిన పోలీసు అధికారి
చంఢీగడ్: ఓ పోలీసు అధికారి మద్యం తాగి బార్ మేనేజర్‌పై కాల్పులు జరిపిన ఘటన పంజాబ్‌లోని బటిండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బార్ మేనేజర్ రాజీవ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, సంగ్ రూర్ సెంట్రల్ జైలులో డిప్యూటీ సూపరిడెంట్‌గా పనిచేస్తున్న బోహత్ సింగ్ మందు (లిక్కర్) కోసం బార్‌కి వెళ్లాడు.
మందు బాటిల్ ఇవ్వాలని బార్ మేనేజర్‌ను అడగ్గా.... డబ్బులివ్వాలని పోలీసుని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన పోలీసు అధికారి.... నన్నే డబ్బులు అడుగుతావా అంటూ తన రివాల్వర్ తీసుకుని బార్ మేనేజర్ రాజీవ్ కుమార్‌పై కాల్పులు జరిపాడు. దీంతో బార్‌మేనేజర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రత్యక్షసాక్షులు తెలిపిన కథనం ప్రకారం ముందుగా పోలీసు అధికారి బార్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై రివాల్వర్ గురి పెట్టినప్పటినా ట్రిగ్గర్ నొక్కలేదని తెలిపారు. పోలీసు అధికారి బోహత్ సింగ్ తన వ్యక్తిగత రివాల్వర్‌తోనే ఈ కాల్పులకు తెగబడినట్లు పేర్కొన్నారు.

ఏటీఎం ద్వారా పోలీసులకు ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే. కానీ చండీగడ్‌లో మాత్రం ఎటీఎంకు వెళ్తే ఫిర్యాదు చేయవచ్చు. 'ఐ-క్లిక్' పేరుతో ప్రతీ ప్రైవేటు ఏటీఎం ద్వారా ప్రజలు తమ సమస్యలను పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చండీగడ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ఆర్పీ ఉపాధ్యాయ తెలిపారు.
ప్రజలు ఫిర్యాదులు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు రాకుండా ఏటీఎం సెంటర్ ద్వారా 'ఐ-క్లిక్' ను ఉపయోగించుకుని ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. ఈ ఫిర్యాదుల విధానం అందరికీ అర్ధమయ్యేలా ఉంటుందని, పోలీస్ కంట్రోల్ రూంకు ఇది అనుసంధామై ఉంటుందని ఆయన తెలిపారు. ఏ సమయంలోనైనా ఏటీఎం ద్వారా ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications