పట్టాలెక్కుతున్న విశాఖ - బెంగళూరు వందేభారత్ స్లీపర్: రూట్, టైమింగ్స్ ఖరారు..!!

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలకు తొలి వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల నుంచి వందేభారత్ స్లీపర్ కు ఆమోదం పైన అనేక ప్రతిపాదనలు తెర మీదకు వచ్చాయి. మూడు మార్గాల్లో ఇందు కోసం కసరత్తు చేయగా.. ఇప్పుడు ఒక మార్గంలో ఏర్పాటుకు అధికారులు ఆమోదం తెలిపారు. విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ పట్టాలెక్కించేందుకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించి రూట్ తో పాటుగా టైమింగ్స్ ఖరారు చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం కొంత కాలంగా కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం డిమాండ్ ఉన్న పలు మార్గాలను పరిశీలన చేసారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు తరువాత విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ పైన పరిశీలన చేసారు. అయితే, విశాఖ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ ఖరారు చేసారు. ఈ రైలుకు సంబంధించిన రూట్.. షెడ్యూల్ పైన పరిధిలోని డీఆర్ఎం లకు కోస్తా జోన్ అధికారుల నుంచి లేఖలు అందాయి. అయితే, ఈ రూట్ లో హాల్టింగ్ స్టేషన్లు.. షెడ్యూల్ డివిజనల్ కార్యాలయాల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఖరారు చేసారు. దసరా లోగా ఈ రైలు పట్టాలెక్కించేందుకు అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.

 వేలాకంణి ఉత్సవాల వేళ ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
వేలాకంణి ఉత్సవాల వేళ ఏపీ మీదుగా ప్రత్యేక రైళ్లు - రూట్, షెడ్యూల్..!!
railways-approves-new-vandebharat-service-between-visakha-banglore-schedule-finalized

రూట్, షెడ్యూల్ ఖరారు

విశాఖ నుంచి రాత్రి రాత్రి 8.15 గంటలకు బయలుదేరి దువ్వాడకు 8.45కు, కృష్ణాకెనాల్‌కు అర్ధరాత్రి 1.05కు, నంద్యాలకు తెల్లవారుజామున 4.40కి, ధర్మవరానికి 7.30కి, బెంగళూరుకు ఉదయం 10 గంటలకు చేరుకుంటుంది. అదే విధంగా తిరుగు ప్రయాణంలో బెంగళూరులో రాత్రి 8 గంటలకు బయలుదేరి ధర్మవరానికి 10.30కి, నంద్యాలకు అర్ధరాత్రి 1.02కి, కృష్ణాకెనాల్‌కు తెల్లవారుజాము 4.55కు, దువ్వాడకు 9.15కు, విశాఖపట్నానికి ఉదయం 10 గంటలకు వస్తుంది' అంటున్నారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు నడుస్తున్న రైళ్లలో వెళ్లాంటే ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. కాగా, ఈ వందేభారత్‌ స్లీపర్ రైలులో 14 గంటల వ్యవధిలోనే చేరుకునే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు ప్రారంభం పైన రెండు రోజుల్లో అధికారికంగా ముహూర్తం ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+