మద్యం మత్తులో నడి రోడ్డులో యువతి చిందులు, బూతులు తిట్టి, సీసీ కెమెరాల్లో !
బెంగళూరు: పీకలదాక మద్యం సేవించిన యువతి నడిరోడ్డులో నానా హంగామా చేసింది. రోడ్ల మీద ఏమిటి ఈ పని అని ప్రశ్నించిన స్థానికుల మీద చిందులు వేసి అమ్మనా బూతులు తిట్టింది. యువతి హంగామా తట్టుకోని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది.
బెంగళూరు నగరంలోని హెణ్ణూరులో ఆదివారం రాత్రి పీకలదాక మద్యం సేవించిన యువతి యువకులు రోడ్ల మీదకు వచ్చారు. ఆ బ్యాచ్ లోని ఓ యువతి రోడ్డు మీద నానా హంగామా చేసింది. అల్లరి, కేకలు ఎక్కువ కావడంతో స్థానికులు రోడ్డు మీదకు వచ్చారు.

స్థానికులు వెళ్లి మద్యం సేవించిన వారిని ప్రశ్నించారు. ఆ సమయంలో ఆ బ్యాచ్ లోని ఓ యువతి స్థానికులను అమ్మనా బూతులు తిట్టి అసభ్యంగా ప్రవర్తించింది. అభ్యంతరం చెప్పిన స్థానికుల మీద ఆ యువతి చెయ్యి చేసుకోవడానికి ప్రయత్నించింది.
కొందరికి నిషా దిగిపోవడంతో యువతి స్నేహితులు స్థానికులు గుమికూడుతున్న విషయం గుర్తించారు. స్థానికులను బూతులు తిడుతున్న యువతికి ఆమె స్నేహితులు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. అయితే అడ్డు వచ్చిన స్నేహితుల మీద ఆ యువతి దాడి చెయ్యడానికి ప్రయత్నించింది.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మద్యం మత్తులో నానా హంగామా చేస్తున్న ఆ యువతిని ఆమె స్నేహితులు అక్కడి నుంచి పిలుచుకుని వెళ్లి పోయారు. మద్యం మత్తులో చిందులు వేసి బూతులు తిట్టిన యువతి ఉత్తర భారతదేశానికి చెందినదని స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు అన్నారు. రోడ్డ మీద, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించి నానా హంగామా చేసిన యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications