అరెస్టుకు వెళ్ళిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తిన మహిళ

మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది.

కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకొంది.

38 ఏళ్ళ వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ నుండి కారులో తిరిగి వస్తోంది. సాల్ట్‌లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు రాగానే కారుపై ఆమె నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తోన్న మరో కారును ఢీకొట్టింది.

Drunk Woman Pulls Cop Into Passionate Kiss After Midnight Accident In Kolkata

ఎదురుగా వస్తోన్న కారు డ్రైవర్ దిగి ఆమెనకు సహయం చేసేందుకు ప్రయత్నిస్తే అతడిని కొట్టింది. దీంతో అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. కారులో ఇరుకొన్నవారిని పోలీసులు బయటకు తీసుకువచ్చారు.

అయితే ఈ ముగ్గురు కూడ మద్యం తాగి ఉన్నారని గుర్తించిన పోలీసులు వారిని స్టేషన్‌కు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన పోలీసులు పక్కనే ఉన్న ఆమె స్నేహితురాలి సహయంతో అదుపులోకి తీసుకొన్నారు.

న్యూసెన్స్ కేసును నమోదుచేశారు. అంతేకాదు పోలీసులకు ముద్దులపేరుతో లంచం ఇవ్వజూపారని కూడ ఆమెపై కేసులు నమోదుచేసి విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+