తప్పతాగి యువతి వీరంగం: పోలీసులపై దాడి(వీడియో)
న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఓ యువతి వీరంగం సృష్టించింది. అంతేగాక, వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుటే నేపాల్‌కు ఆ యువతి ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్‌పై చేయిచేసుకుంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం మునిర్కాలో నేపాల్ యువతి(28) ఆటో ఎక్కింది. అప్పటికే అతిగా మద్యం తాగిన ఆమె ఆటో డ్రైవర్‌ను వేధించడం మొదలు పెట్టింది.
డ్రైవర్‌ను బూతులు తిడుతూ అనుచితంగా ప్రవర్తించింది. దీంతో అతను పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాడు. ఆటో నుంచి దిగకుండా సతాయిస్తోందని, తనను కొడతానంటూ బెదిరిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆటోను తీసుకెళ్లి వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆపాడు. పోలీసులు రావడంతో వారి పట్లా ఆమె దురుసుగానే ప్రవర్తించింది. ఓ మహిళ కానిస్టేబుల్‌ను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టింది. మరో మహిళా కానిస్టేబుల్‌ను దూషిస్తూ దాడి చేసింది.
దీంతో పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకుని వైద్యపరీక్ష కోసం సఫ్దార్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమె మద్యంతాగినట్టు పరీక్షల్లో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలైంది.
కాగా, ఆటో డ్రైవర్ తన సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. పోలీసులపై దాడి చేసిన దృశ్యాలను ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications