తాగుబోతు, భార్య మీద అనుమానం, తల నరికి ఐదు కిలో మీటర్లు, ఆగ్రాలో కలకలం!

ఆగ్రా: కుటుంబ సమస్యలు, భార్య అక్రమ సంబంధం సాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు భర్త. భార్యతో గొడవ పెట్టుకున్న భర్త ఆమె తల, మొండెం వేరు చేసి ఐదు కిలో మీటర్లు దూరం నడుచుకుంటూ వెళ్లడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా సమీపంలో జరిగింది. భార్య శరీరం, తల వేరు చేసిన వ్యక్తి మద్యపానం సేవించడానికి, గ్యాంబ్లింగ్, జూదం ఆటలకు బానిసై భారీగా నగదు పోగొట్టుకున్నాడని, ఆర్థికంగా నష్టపోయాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.

15 ఏళ్ల క్రితం పెళ్లి

15 ఏళ్ల క్రితం పెళ్లి

తాజ్ మహల్ సమీపంలోని కచ్ పుర్ ప్రాంతానికి చెందిన శాంతి దేవి (29) అనే మహిళకు, నరేష్ భగెల్ (33) అనే వ్యక్తికి 15 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. నరేష్, శాంతి దేవి దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. నరేష్ టీవీ మెకానిక్ గా పని చేస్తూ కుటుంబ సభ్యులను పోషిస్తున్నాడు.

గ్యాంబ్లింగ్, తాగుబోతు

గ్యాంబ్లింగ్, తాగుబోతు

భార్య శాంతి దేవి అక్రమ సంబంధం కొనపాగిస్తోందని నరష్ కు చాల ఏళ్ల నుంచి అనుమానం ఉంది. భార్య మీద అనుమానంతో నరేష్ మద్యం తాగడానికి బానిస అయ్యాడు. దానికి తోడు స్నేహితులతో కలిసి విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ ఆడటం మొదలు పెట్టాడు.

ఆస్తీ మటుమాయం

ఆస్తీ మటుమాయం

గ్యాంబ్లింగ్, జూదం ఆడుతున్న నరేష్ ఉన్న ఆస్తి సగం అమ్మి నాశనం చేశాడు. టీవీ మెకానిక్ గా పని చేస్తే వచ్చే డబ్బుతో మద్యం తాగుతున్న నరేష్ భార్య, పిల్లలను పట్టించుకోవడం పూర్తిగా మానేశాడు. పిల్లను పోషించుకోవడానికి శాంతి దేవి చిన్నచిన్న పనులు చేసి డబ్బు సంపాదిస్తోంది.

భార్య తలనరికేశాడు

భార్య తలనరికేశాడు

మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన నరేష్ భార్య శాంతి దేవితో గొడవ పెట్టుకున్నాడు. తల్లిదండ్రుల గొడవతో భయానికి గురైన వారి పిల్లలు ఇంటిలోని వేరే గదిలోకి వెళ్లి నిద్రపోయారు. బెడ్ రూంలో ఉన్న నరేష్ భార్య శాంతి దేవిని పట్టుకుని చితకబాదేశాడు. తరువాత నరేష్ భార్య శాంతి దేవి నోటిలో బట్టలు కుక్కి పదునైన కోడవలి తీసుకుని ఆమె తల నరికి మొండెం వేరు చేశాడు.

తల ఎత్తుకుని ఐదు కిలో మీటర్లు !

తల ఎత్తుకుని ఐదు కిలో మీటర్లు !

భార్య శాంతి దేవి తల చేతిలో పట్టుకున్న నరేష్ ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లాడు. ఉదయం నిద్రలేచిన నరేష్ కుమార్తె పాయల్ (14) బెడ్ రూంలోకి వెళ్లి తల లేని తల్లి మొండెం చూసి గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో స్థానికులు వచ్చి చూసి భయభ్రాంతులకు గురైనారు.

పోలీసులకు షాక్

పోలీసులకు షాక్

నరేష్ భార్య శాంతి దేవి తల పట్టుకుని సుమారు ఐదు కిలో మీటర్ల దూరం నడిచి హరిపర్వత్ పోలీస్ స్టేషన్ వైపు బయలుదేరాడు. మార్గం మధ్యలో ట్రాఫిక్ పోలీసులు విషయం గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని హరిపర్వత్ పోలీస్ స్టేషన్ అధికారి ఉదయ్ వీర్ సింగ్ మాలిక్ మీడియాకు చెప్పారు.

అందుకే చంపేశాను

అందుకే చంపేశాను

తన భార్య శాంతి దేవి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తోందని, అందుకే చంపేశానని నరేష్ చెప్పాడని పోలీసు అధికారి ఉదయ్ వీర్ సింగ్ చెప్పారు. తన కుమారుడు నరేష్ జూదం, గ్యాంబ్లింగ్ ఆడటానికి, మద్యం తాగడానికి బానిసై ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడని అతని తండ్రి ఠాకూర్ దాస్ సమాచారం ఇచ్చాడని పోలీసు అధికారి ఉదయ్ వీర్ సింగ్ అన్నారు. నిందితుడు నరేష్ దగ్గర శాంతి దేవి తల స్వాధీనం చేసుకున్ని మొండెంను ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+