ముగ్గురు యువతులు.. ముద్దు పెట్టుకోబోయి.. ఎంత పనిచేశారంటే!
బెంగుళూరు : మద్యం తాగి కారుతో రోడ్డెక్కిన యువతులు.. మత్తులో కారులోనే హంగామా చేశారు. అదే క్రమంలో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడంతో.. అదుపు తప్పిన కారు పక్కనే వెళ్తున్న మరో రెండు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఓ యువకుడు వారి కారును వెంబడించి ముగ్గురు యువతులను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
బెంగుళూరు పరిధిలోని నందిదుర్గ రోడ్డుపై అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. నగరానికి చెందిన షాలిని అనే యువతి తన స్నేహితులైన మరో ఇద్దరు యువతులతో కలిసి పీకలదాకా మద్యం సేవించింది. కారులోనే మద్యం సేవిస్తూ హంగామా చేయడం మొదలుపెట్టారు. మద్యం మత్తులో ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడానికి యత్నించడంతో కారు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న మరో కారును, బైక్ ను ఢీ కొట్టింది.

ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకోవడానికి యత్నించడంతో.. ఫర్హాన్ అనే వ్యక్తి షాలిని కారును వెంబడించి ఆ యువతులను ఆర్టీ నగర పోలీసులకు అప్పగించాడు. ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫర్హాన్ పోలీసులకు చెప్పాడు. ఫర్హాన్ ఫిర్యాదు మేరకు షాలినిని వైద్య పరీక్షలకు పంపించారు పోలీసులు.
అయితే షాలిని మద్యం సేవించలేదంటూ బౌరింగ్ ఆసుపత్రి వైద్యులు రిపోర్టు ఇవ్వడంతో అంతా షాక్ అయ్యారు. వైద్యులు తప్పుడు నివేదిక ఇచ్చారంటూ.. షాలిని ఢీ కొట్టిన కారు డ్రైవర్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతం కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications