స్టార్ హోటల్ లో రచ్చ: తాగుబోతు లవర్స్ అరెస్టు
చెన్నై: మద్యం మత్తులో స్టార్ హోటల్ లో నానా హంగామా చేసి, సిబ్బందిపై దాడి చేసిన ప్రేమికులను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన దాఖర్ (26), అతని ప్రియురాలు జయాధాన్ సంగ్ (23) అనే ఇద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్ లోని కేడాకు చెందిన ధాఖర్ చెన్నై చేరుకుని ప్రవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను సోమవారం రాత్రి చెన్నైలోని నుంగంబాక్కంలోని అన్నా వంతెన సమీపంలోని స్టార్ హోట్ లోకి వెళ్లాడు.

తరువాత ధాఖర్ ప్రియురాలు జయాధన్ సంగ్ తో కలిసి పీకలదాక మద్యం సేవించాడు. ఇద్దరూ మంగళవారం వేకువ జామున 3.30 గంటల వరకు మద్యం సేవించారు. తరువాత బిల్లు చెల్లించి అక్కడి నుంచి తూలుతూ బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు.
అయితే స్టార్ హోటల్ ప్రవేశ ద్వారం దగ్గర ఏర్పాటు చేసిన అద్దాల మీదపడ్డారు. ఇద్దరూ ఒకే సారిపడటంతో రూ. 50 వేల విలువైన అద్దాలు పగిలిపోయాయి. దీనిపై ప్రశ్నించిన హోటల్ సిబ్బంది మీద ఇద్దరు దాడి చేశారు. హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రేమికులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications