నావీ జవాను అనుమానాస్పద మృతి

కొచ్చి: విధులలో ఉన్న నావీ జవాను అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన కేరళలలోని కొచ్చిలో జరిగింది. జవాను శరీరం మీద బుల్లెట్ గాయాలు అయ్యాయని పోలీసు అధికారులు చెప్పారు. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నాయక్ శివదాసన్ (53) నావీలో జవానుగా ఉద్యోగం చేస్తున్నారు. ఆదివారం రాత్రి కొచ్చి నావెల్ బేస్ లో సెంట్రీగా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం ఉదయం చూడగా శివదాసన్ శరీరంలో బుల్లెట్ గాయాలై శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న నావీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

DSC jawan found dead at Naval base in Kochi

స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే నాయక్ శివదాసన్ ఎలా మరణించాడు అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. నాయక్ శివదాసన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని కొచ్చి నావీ అధికారులు చెప్పారు.

ఫైరింగ్ ప్రమాదవశాత్తు జరిగిందా ? ఎవరైనా కాల్పులు జరిపారా అని ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు. నాయక్ మృతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని నావీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నాయక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+