బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Dubai wife: నా భార్యకు ఉగ్రవాదులతో లింక్, పాకిస్తాన్ స్కూల్ లో ఉద్యోగం, కేసు పెట్టిన భర్త, షాక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: కుటుంబ సభ్యులు చూపించిన యువతిని వివాహం చేసుకున్న భర్త ఆమెతో చక్కగా కాపురం చేసి పిల్లలకు తండ్రి అయ్యాడు. పిల్లలు పెరిగిపెద్ద అవుతున్న సమయంలో భార్యకు దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. 11 సంవత్సరాల క్రితం భర్త, పిల్లలను ఇక్కడే వదిలేసి మొదటిసారి దుబాయ్ వెళ్లింది. దుబాయ్ లో అక్కడే ఉద్యోగం చేస్తున్న భార్య రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి సొంత ఊరికి వచ్చి వెలుతోంది. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారని, నువ్వు ఇక దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండాలని భర్త అతని భార్యకు నచ్చ చెప్పారు.

నేను దుబాయ్ లో ఉండాలి, నన్ను దుబాయ్ కి పంపించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్థాన్ లో ఉన్న నా ఫ్రెండ్స్ కు చెప్పి నీ అంతు చూస్తానని భార్య బెదిరించిందని సమాచారం. 11 సంవత్సరాల నుంచి నువ్వు సంపాధించిన డబ్బు ఏం చేశావు ?, ఎవరికి ఇచ్చావు అని భర్త ప్రశ్నిస్తే కేరళ వ్యక్తి వడ్డీకి ఇచ్చానని భార్య చెప్ప్పిందని సమాచారం. కేరళకు చెందిన వ్యక్తికి భర్త ఫోన్ చేస్తే నువ్వు దుబాయ్ లో ఉన్న నీ భార్యను నా దగ్గరకు పిలుచుకుని వచ్చి వదిలేసి వెళ్లిపోవాలి, ఆమెతో నాకు అక్రమ సంబంధం ఉందని, నువ్వే నీ భార్యను శాస్వతంగా నాకు అప్పగించి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తానని కేరళ వ్యక్తి బెదిరిస్తున్నాడని భర్త ఆరోపిస్తున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు, జీహాదీలతో తన భార్యకు సంబంధాలు ఉన్నాయని, మొదట నన్ను, నా కుటుంబ సభ్యులను కాపాడాలని, దుబాయ్ నుంచి ఆమెను పిలిపించి విచారణ చెయ్యాలని ఆమె భర్త స్వయంగా భర్త జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు పెట్టడం కలకలం రేపింది.

Illegal affair: భర్తకు విడాకులు, 20 సార్లు పొడిచి చంపిన ప్రియుడు, పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్!Illegal affair: భర్తకు విడాకులు, 20 సార్లు పొడిచి చంపిన ప్రియుడు, పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్!

 వ్యవసాయం చేయిస్తున్న భర్త

వ్యవసాయం చేయిస్తున్న భర్త

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని బెళ్తంగడి తాలుకాలోని నెరియా గ్రామంలో చిదానంద అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. వ్యవసాయం చేయిస్తున్న చిదానంద చాలా సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూసిన రాజీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సంతోషంగా కాపురం చేసిన చిదానంద, రాజీ దంపతులకు పిల్లలు ఉన్నారు.

 వద్దంటే దుబాయ్ వెళ్లిన భార్య

వద్దంటే దుబాయ్ వెళ్లిన భార్య

కొడుకుకు రెండు సంవత్సరాలు, కూతురికి 7 నెలలు ఉన్న సమయంలో చిదానంద భార్య రాజీకి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. అప్పట్లు భర్త చిదానంద దుబాయ్ కి వద్దని అతని భార్య రాజీకి చెప్పాడని సమాచారం. 11 సంవత్సరాల క్రితం భర్త చిదానంద, పిల్లలను ఇక్కడే వదిలేసిన రాజీ మొదటిసారి దుబాయ్ వెళ్లింది. దుబాయ్ లోని స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న భార్య రాజీ సంవత్సరానికి ఒకసారి మంగళూరు సమీపంలోని ఒకసారి సొంత ఊరికి వచ్చి మళ్లీ దుబాయ్ వెలుతోంది.

2018లో వచ్చిన భార్యతో గొడవ

2018లో వచ్చిన భార్యతో గొడవ

2018లో రాజీ దుబాయ్ నుంచి మంగళూరు చేరుకునింది. పిల్లలు పెరిగి పెద్ద అవుతున్నారని, ఇక్కడే ఉండి పిల్లలను బాగా చదివించుకుకోవాలని చిదానంద అతని భార్య రాజీకి నచ్చచెప్పాడు. నువ్వు ఇక దుబాయ్ వెళ్లకుండా ఇక్కడే ఉండాలని భర్త అతని భార్య రాజీకి అనేక రకాలుగా నచ్చచెప్పాడు. అయితే రాజీ భర్త చిదానందతో పాటు కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు వినకుండా దుబాయ్ వెళ్లిపోయిందని ఆరోపణలు ఉన్నాయి.

నా భార్య మొత్తం రివర్స్ అయ్యింది

నా భార్య మొత్తం రివర్స్ అయ్యింది

దుబాయ్ నుంచి వచ్చిన తన భార్య ఊరిలో పండుగ చేసిన సమయంలో పూలు, పండ్లు ఇస్తే తీసుకోలేదని, ఓనమ్ పండుగ మాత్రం చెయ్యాలని చెప్పిందని ఆమె భర్త చిదానంద ఆరోపిస్తున్నాడు. నా కుమార్తెను పిలుచుకుని దుబాయ్ వెలుతానని చెప్పిందని, అందుకు మా కుటుంబ సభ్యులు నిరాకరించాడని చిదానంద అంటున్నాడు, నీకు విడాకులు ఇస్తే నువ్వే ఇద్దరు పిల్లలను పెంచి పోషించుకోవాలని, వారికి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన తన భార్య రాజీ దుబాయ్ వెళ్లిపోయిందని ఆమె భర్త చిదానంద దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ రిషికేష్ సోనెవానాకు ఫిర్యాదు చేశారు.

 నా భార్యకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్ ?

నా భార్యకు పాకిస్తాన్ ఉగ్రవాదులతో లింక్ ?

మొదట దుబాయ్ లో నేను బీఆర్. శెట్టి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని తన భార్య రాజీ చెప్పిందని, ఆమె బ్యాగ్ పరిశీలిస్తే ఇప్పుడు పాకిస్తాన్ కు చెందిన స్కూల్ లో ఉద్యోగం చేస్తోందని ఐడీ కార్డు ఉందని ఆమె భర్త చిదానంద జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. నేను కచ్చితంగా దుబాయ్ లో ఉండాలి, నన్ను దుబాయ్ కి పంపించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పాకిస్థాన్ లో ఉన్న నా ఫ్రెండ్స్ కు చెప్పి నీ అంతు చూస్తానని తన భార్య రాజీ నన్ను బెదిరించిందని ఆమె భర్త చిదానంద జిల్లా ఎస్పీ రిషికేష్ కు ఫిర్యాదు చేశాడు.

 నా భార్యను వాడి దగ్గరకు పంపించాలంటా

నా భార్యను వాడి దగ్గరకు పంపించాలంటా

11 సంవత్సరాల నుంచి నువ్వు సంపాధించిన డబ్బు ఏం చేశావు ?, ఎవరికి ఇచ్చావు అని రాజీని ప్రశ్నిస్తే కేరళ వ్యక్తి వడ్డీకి ఇచ్చానని తన భార్య చెప్ప్పిందని చిదానంద అంటున్నాడు. కేరళకు చెందిన వ్యక్తికి నేను ఫోన్ చేస్తే నువ్వు దుబాయ్ లో ఉన్న నీ భార్య రాజీని నా దగ్గరకు పిలుచుకుని వచ్చి ఇక్కడే వదిలేసి వెళ్లిపోవాలి అన్నాడని చిదానంద జిల్లా ఎస్పీకి చెప్పాడు. నువ్వే నీ భార్య రాజీని శాస్వతంగా నాకు అప్పగించి నువ్వు వేరే పెళ్లి చేసుకుంటే మీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తానని, ఎదురు తిరిగితే నిన్ను చంపేస్తానని కేరళ వ్యక్తి నన్ను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ చిదానంద అతని భార్య రాజీ మీద కేసు పెట్టాడు.

నన్ను మీరే కాపాండండి

నన్ను మీరే కాపాండండి

తన భార్య రాజీకి పాకిస్తాన్ లోని ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఆమె పాకిస్తాన్ కు చెందిన స్కూల్ లో పని చేస్తోంది, నన్ను, మా కుటుంబ సభ్యులను మీరే కాపాడాలని చిదానంద దుబాయ్ లో ఉంటున్న అతని భార్య రాజీ మీద దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీ రుషికేష్ కు ఫిర్యాదు చేసి కేసు పెట్టాడు. దుబాయ్ లో ఉంటున్న తన భార్య రాజీని వెంటనే భారత్ పిలిపించి ఆమెను విచారణ చెయ్యాలని భర్త చిదానంద అతని భార్య మీద కేసు పెట్టడం కలకలం రేపింది.

English summary
Dubai wife: The husband complained to the Dakshina Kannada district SP about his wife's connection with the Terrorist organization.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X