ఉరేసుకున్న మహిళను కాపాడాలనుకున్నారు.. ఊహించని షాక్ తో బిత్తరపోయారు

ఆమ్ స్టర్ డ్యామ్ : కిటికీలోంచి చూస్తే.. మహిళ ఉరేసుకుని వేలాడుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటికీ ప్రాణాలు కోల్పోయిందో లేదో కూడా అక్కడున్న వాళ్లు నిర్ధారించలేని పరిస్థితి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు తలుపులు బద్దలు కొట్టారు. తీరా లోపలికి వెళ్లి చూస్తే.. అంతా షాక్.

ఎందుకంటే.. ఆ గదిలో ఉరివేయబడ్డది మనిషి కాదు, ప్రాణం లేని ఓ బొమ్మ. తూర్పు ఆమ్ స్టర్ డ్యామ్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన ఈ ఘటన అక్కడి పోలీసులను, అపార్ట్ మెంట్ వాసులను విస్మయానికి గురి చేసింది. అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో మహిళ ఉరివేసుకుని ఉండడాన్ని గమనించారు అదే అపార్ట్ మెంట్ లోని కొంతమంది వ్యక్తులు. కిటికీలోంచి చూస్తే.. ఆమె గాల్లో వేలాడుతున్నట్టు స్పష్టంగా కనిపింపచడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావించారు.

Dutch police experienced a 'shocking incident'

దీంతో ఎలాగైనా ఆమెను రక్షించాలని పోలీసులకు విషయం చేరవేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక అంతా కలిసి తలుపులు బద్దలు కొట్టి లోపలికి అడుగుపెట్టారు. తీరా మహిళ వేలాడుతున్న దగ్గరికి వెళ్లి పరిశీలించగా.. అది వట్టి బొమ్మ అని తేలడంతో అంతా అవాక్కయ్యారు. అలాగే తాము భావించినట్టు ప్రమాదమేమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాలింగ్ బెల్ కొట్టినా ఎంతకీ స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చామని చెబుతున్నారు అపార్ట్ మెంట్ వాసులు. కాగా, దీనిపై స్పందించిన డచ్ పోలీసులు ఇదో విచిత్రమైన అనుభవంగా వెల్లడించారు. అయితే ఉరివేయబడ్డ ఆ బొమ్మ ఓ సెక్స్ టాయ్ గా నిర్దారించారు పోలీసులు. ఆమ్ స్టర్ డ్యామ్ లో సెక్స్ వర్క్ కు చట్టబద్దత ఉండడంతో అక్కడ సెక్స్ టాయ్ అమ్మకాలు విరివిగా జరుగుతాయి. అయితే అపార్ట్ మెంట్ లో సెక్స్ టాయ్ ఎందుకు ఉరేశారన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+