కొత్త యాప్: సాప్ట్‌వేర్ ఇంజనీర్లకు 10 నిమిషాల్లో రుణం

మనిషి జీవితంలో ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి డబ్బు అవసరం. డబ్బు అవసరమైనప్పుడు ఏదో ఒక రూపంలో అప్పు చేయాల్సిన అవసరం రావొచ్చు. ఆ సమయంలో మనకు వెంటనే గుర్తుకువచ్చేది స్నేహితులు లేదా బంధువులు. వారి వద్ద ఉండొచ్చు లేదా ఉండకవచ్చు. మరొక మార్గం బ్యాంకులను ఆశ్రయించడం.

అయితే అందుకు బ్యాంకులు కొంత సమయాన్ని తీసుకుంటాయి. అయితే మీకు పది నిమిషాల్లో మీ బ్యాంక్‌లో డబ్బులు క్రెడిట్ అయ్యేలా ఓ యాప్‌ను రూపొందించారు. ఆ యాప్ పేరు 'ఎర్లీ శాలరీ' యాప్. పుణెకి చందిన అక్షయ్ మెహరోత్రా మనసులో నుంచి పుట్టిన ఆలోచనే ఈ యాప్. ఆయన విజిటింగ్ కార్డుపై కూడా 'హలో, నేను అక్షయ్, డబ్బు అవసరమా?' అనే కనిపిస్తుంది.

స్మార్ట్ ఫోన్‌లో 'ఎర్లీ శాలరీ' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రుణం కోసం రిక్వెస్ట్ పంపితే, నిబంధనలన్నీ పాటించే వారికి ఈ స్టార్టప్ సంస్థ నిమిషాల్లో రూ. లక్ష వరకూ రుణమిస్తుంది. అతి తక్కువ సమయంలో స్వల్పకాలిక రుణాలను మాత్రమే ఈ యాప్ అందిస్తుంది.

EarlySalary, an app to avail short-term loans through smartphones

ఈ యాప్‌ ద్వారా రుణాన్ని కావాలనుకునేవారు యాప్‌లోకి ఫేస్‌బుక్, లింక్డ్ ఇన్ వంటి సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రవేశించాలి. నెల వేతనం, ఎంత డబ్బు అవసరం? ఎప్పుడు తిరిగిస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత పాన్ (పర్మినెంట్ ఎకౌంట్ నంబర్), మూడు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

మీ బ్యాంక్ అకౌంట్ ఖాతా వివరాలు ఇచ్చిన పది నిమిషాల్లోనే మీకు డబ్బు క్రెడిట్ అవుతుంది. ఎర్లీ యాప్ ద్వారా తన కస్టమర్లకు అప్పులిచ్చేందుకు సంస్ధ ఇప్పటికే రూ. 10 కోట్లను సిద్ధం చేసింది. ఈ యాప్ ద్వారా రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకూ రుణమిస్తారు. అయితే తీసుకున్న రుణాన్ని 7 రోజుల నుంచి నెలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంది.

తీసుకునే రుణాన్ని బట్టి వడ్డీ రేటు 24 నుంచి 30 శాతం వరకూ ఉంది. అయితే ఈ యాప్ అందిస్తోన్న వడ్డీరేటు సాధారణ క్రెడిట్ కార్డు కన్నా తక్కువగా ఉండటం విశేషం. ఈ తరహా విధానం బ్రిటన్‌లో విజయవంతమైందని, అందువల్లే దీన్ని భారత్ లోనూ ప్రవేశ పెట్టాలని భావిస్తున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో మరిన్ని నిధులను సేకరిస్తామన్నారు. ఎర్లీ యాప్ భారత్‌లోని 22 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉన్న ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఆర్థిక కష్టాలు తీర్చేందుకు సహకరిస్తుందని భావిస్తున్నట్టు మెహరోత్రా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా విధానాన్ని పూణెలో ప్రవేశపెట్టామని త్వరలో బెంగుళూరుకి విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+