Gas Agency: గ్యాస్ ఏజెన్సీతో లక్షల్లో ఆదాయం.. ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకోండి..

Gas Agency: ఈ రోజుల్లో చాలా మంది ఏదో ఒక సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాంటి వారికి దేశంలోని వంట గ్యాస్ పంపిణీ కంపెనీలు ఇండియన్ ఆయిల్- ఇండేన్, భారత్ పెట్రోలియం- భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం- HP గ్యాస్. ఇవి ప్రభుత్వ రంగంలోని కంపెనీలకు చెందిన గ్యాస్ కంపెనీలు సదవకాశాన్ని అందిస్తున్నాయి. ఇవి డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటాయి. ప్రజలు వీటినే గ్యాస్ ఏజెన్సీ అవి వాడుక బాషలో వ్యవహరిస్తుంటారు. ఎవరైనా గ్యాస్ ఏజన్సీని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం..

గ్యాస్ ఏజెన్సీ ప్రారంభం..

ఈ గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడానికి కొన్ని నియమాలు ఉంటాయి. కంపెనీలు విధించే నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించడానికి లైసెన్స్ పొందాలి. ఏజెన్సీలను మంజూరు చేసేందుకు కంపెనీలు ఎప్పటికప్పుడు దరఖాస్తులను స్వీకరిస్తుంటాయి.

 దరఖాస్తు విధానం..

దరఖాస్తు విధానం..

హిందుస్థాన్ పెట్రోలియం వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించాలనుకునే అభ్యర్థులు వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత వ్యక్తి ఎంపికైతే ఇంటర్వ్యూకు పిలవబడతారు. ప్యారామీటర్స్ ప్రకారం గ్యాస్ ఏజెన్సీ యజమానులు ఎంపిక చేయబడతారు. ఇంటర్వ్యూ తర్వాత షార్ట్‌లిస్ట్ అయిన వ్యక్తుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది. ఆ తర్వాత దీనికోసం అవసరమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది.

పరిశీలన..

పరిశీలన..

పత్రాలను పరిశీలించిన తర్వాత సంబంధిత కంపెనీ నేరుగా గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసే స్థలం, స్టోరేజ్ గోడౌన్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలిస్తుంది. స్వంత స్థలం లేకపోతే.. తప్పనిసరిగా 15 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న స్థలాలను కలిగి ఉండాలి.

ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు?

ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు?

50 శాతం దరఖాస్తులు రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వటం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇందులో ఉంటుంది. నిబంధనల ప్రకారం స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, సాయుధ దళాల సిబ్బంది, పదవీ విరమణ పొందిన పోలీసులు, జాతీయ క్రీడాకారులు, సామాజికంగా వికలాంగులు రిజర్వేషన్ల ప్రయోజనం పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా..

LPG డిస్ట్రిబ్యూషన్ కోసం దరఖాస్తులు వార్తాపత్రికలలో తెలియజేయబడతాయి. సంబంధిత సమాచారం https://www.lpgvitarakchayan.in పోర్టల్‌లో కూడా అందుబాటులో ఉంది. పట్టణ, శివారు ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాలంటే కనీసం.. రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.15 లక్షల వరకు ఖర్చవుతుంది.

రోజూ రూ.18,000 వరకు సంపాదన..!

రోజూ రూ.18,000 వరకు సంపాదన..!

14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌ను విక్రయించినందుకు గ్యాస్ ఏజెన్సీలకు కనీసం రూ.61.84 కమిషన్ లభిస్తుంది. 5 కిలోల సిలిండర్ విక్రయిస్తే రూ.30.09 కమిషన్ రూపంలో కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తాయి. అంటే ఏజెన్సీ ప్రతి రోజు కనీసం 300 గ్యాస్ సిలిండర్లను విక్రయించినా వారికి కమిషన్ రూపంలో దాదాపు రూ.18,500 వరకు ఆదాయం లభిస్తుంది. ఇక పండుగల సీజన్, వర్షా కాలం, సీతాకాలంలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టీ ఈ సమయాల్లో డిమాండ్ సైతం భారీగానే ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+