అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
అరుణాచల్ ప్రదేశ్: ఈశాన్య భారతంలో భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారు జామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. తెల్లవారుజామున 1.45 గంటలకు భూమి కపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించడంతో దీని ప్రభావం అస్సాం, చైనా సరిహద్దులు, టిబెట్, మయన్మార్‌లలో కనిపించింది. అలాంగ్‌కు ఆగ్నేయ దిశలో 40 కిలోమీటర్ల దూరంలో, రాజధాని ఈటానగర్‌కు నైరుతీ దిశలో 180 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. భారత భూకంపకేంద్రం మాత్రం అరుణాచల్ ప్రదేశ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Felt #earthquake (#भूकंप) M5.7 strikes 109 km NW of #Dibrugarh (#India) 9 min ago. Please report to: https://t.co/xCfnWVS2z4 pic.twitter.com/b46jwsQOqc
— EMSC (@LastQuake) April 23, 2019
ఇదిలా ఉంటే పొరుగుదేశం నేపాల్‌లోని ఖాట్మండులో కూడా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.8గా నమోదైంది. ధాడింగ్ జిల్లా నౌబైస్‌లో రెండు సార్లు భూమి కంపించింది. తొలిసారిగా ఉదయం 6:29 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2గా నమోదైంది. రెండో సారి కొన్ని నిమిషాల వ్యవధిలోనే అంటే 6:40 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది. నేపాల్‌లో భూమి కంపించడంతో దీని ప్రభావం టిబెట్, ఇతర భారత సరిహద్దు రాష్ట్రాల్లో కనిపించిందని చైనా ప్రభుత్వ వార్త ఛానెల్ పేర్కొంది.

ఇదిలా ఉంటే భారత్ చైనాల మధ్య అరుణాచల్ ప్రదేశ్‌పై కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటి వరకు దీనికి ఒక పరిష్కారం కనుగొనలేదు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఈశాన్యరాష్ట్రంగా భారత్ పరిగణిస్తుండగా... అందులో 90వేల చదరపు కిలోమీటర్ల మేరా భూభాగం చైనాకు చెందుతుందని డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ మయన్మార్, భూటాన్ దేశాలకు సరిహద్దులో ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications