దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం (వీడియో)
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. భూకంపం ప్రకంపనలకు ఢిల్లీ ప్రజలు ఒక్క సారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత 1.40 గంటల సమయంలో ఢిల్లీలో భూకంపం వచ్చింది.

రిక్టారు స్కేల్ పై 3.0 తీవ్రత నమోదు అయ్యిందని సంబంధిత శాఖ సీనియర్ అధికారి టీ.ఆర్. వైద్య చెప్పారు. కొన్ని సెకన్ల పాటు దీని ప్రకంపనలు ఢిల్లీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని, ప్రజలు ఆందోళనతో హడలిపోయారని అధికారులు అన్నారు.
భూకంప కేంద్రం సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిసిందని అధికారులు చెప్పారు. అయితే ఈ భూకంపం వలన ఎవ్వరికి ఎలాంటి హాని జరగలేదని, ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు అన్నారు. అర్దరాత్రి భూకంపం రావడంతో ఢిల్లీ ప్రజలు శనివారం ఉదయం వరకు జాగరణ చేశారు.












Click it and Unblock the Notifications