బెంగళూరు సమీపంలో తేలికపాటి భూకంపం

బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలో ఈ ఉదయం తేలికపాటి భూప్రకంపనలు నమోదయ్యాయి. స్వల్ప భూకంపం సంభవించింది. దొడ్డబళ్ళాపుర సమీపంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ భూప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదు. బెంగళూరు ఉత్తరప్రాంతం, దొడ్డబళ్లాపుర చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు ఈ ప్రకంపనలను నిర్ధారించారు.

రిక్టర్ స్కేల్ పై ఈ భూకంప తీవ్రత 3.0గా నమోదైంది. కర్ణాటక విపత్తు నిర్వహణ సంస్థ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ఉదయం 9:01 నిమిషాల సమయంలో భూమి ప్రకంపించినట్లు తెలిపింది. దొడ్డబళ్ళాపురకు ఉత్తరదిశగా దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తుబగెరె పంచాయతీ పరిధిలోని తిమ్మోజనహళ్లి గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ప్రఖ్యాత ఘాటీ సుబ్రహ్మణ్య ఆలయానికి సమీపంలో ఉంటుందీ గ్రామం.

Earthquake measuring 3 0 on the Richter scale was recorded Doddaballapur taluk Bangalore rural

ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మోలాజి సెంటర్ తెలిపింది. ఈ కదలికలు, భూపొరలలో ఏర్పడిన స్వల్ప మార్పుల వల్ల ఈ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయని వివరించింది. దీని తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ సంభవించినట్లు సమాచారం అందలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోని పాత్రలు కిందపడటం, ఫ్యాన్లు ఊగిపోయాయి. దీంతోప్రజలు ఇళ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు.

Earthquake measuring 3 0 on the Richter scale was recorded Doddaballapur taluk Bangalore rural

సాధారణంగా దక్కన్ పీఠభూమి పరిధిలో భారీ భూకంపాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఉపరితల పొరల్లో వచ్చే స్వల్ప మార్పుల వల్ల ఎప్పటికప్పుడు ఇలాంటి తేలికపాటి ప్రకంపనలు వస్తుంటాయి. స్థానిక యంత్రాంగం కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా స్థానిక అధికారులు పరిసర గ్రామాల్లో సమాచారం సేకరిస్తున్నారు. భూకంపాలు సంభవించినప్పుడు స్థానిక యంత్రాంగం ఇచ్చే సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+