జమ్ముకశ్మీర్‌లో భూకంపం, 4.4 తీవ్రతతో ప్రకంపనాలు, ఇళ్ల నుంచి జనం పరుగులు

జమ్ముకశ్మీర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.4గా నమోదైంది. భూప్రకంపనాలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. హన్లెకు ఈశాన్యంలో 332 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. కశ్మీర్‌తోపాటు పాకిస్తాన్, చైనా, ఆప్ఘనిస్తాన్, తజకిస్తాన్‌లోనూ భూమి కంపించింది. గత 24 గంటల్లో కశ్మీర్‌లో రెండోసారి భూమి కంపించింది. నిన్న కార్గిల్‌లో కూడా భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.

Earthquake of 4.4 magnitude hits Jammu & Kashmir

Recommended Video

    Earthquakes In Haryana & Mizoram వరుస భూకంపాలు.. భారత్‌కు క్లిష్ట పరిస్థితి..!!

    భూకంపంతో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి వివరాలేమీ తెలియరాలేదు. ఈ నెల 14వ తేదీన కూడా జమ్ముకశ్మీర్‌లో 3 తీవ్రతతో భూమి కంపించింది. ఇటీవల మిజోరం, ఢిల్లీ, గుజరాత్‌లో కూడా భూ ప్రకంపనాలు వచ్చాయి. బుధవారం రోహ్‌తక్‌లో 2.8 తీవ్రతతో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇటీవల నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో 18 సార్లు భూకంపం వచ్చింది. 8 సార్లు రోహ్‌తక్‌లోనే వచ్చింది. అయితే ఇవన్నీ కూడా మధ్యస్థ భూకంపాలు కావడంతో.. ప్రాణ నష్టమేమీ సంభవించలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+