భారత ఉపఖండం చుట్టూ భూకంపాలు: నాలుగు దేశాల్లో భూప్రకోపం
భారత ఉపఖండంలో వరుస భూకంపాలు సంభవించాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సహా చైనా, టిబెట్ లల్లో దాదాపుగా ఏకకాలంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. ఈ తెల్లవారు జామున 4:56 నుంచి 6:05 నిమిషాల మధ్యలో ఆయా దేశాలను వణికించాయి. అంతకుముందు రిక్టర్ స్కేల్ పై 7:1 తీవ్రతతో టిబెట్ లో భారీ భూకంపం సంభవించింది. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 నిమిషాలకు చైనాలో 4.3 తీవ్రతతో భూమి ప్రకంపించింది.
తాజాగా నమోదైన భూప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.1 నుంచి 4.9 గా నమోదయ్యాయి. ఈ ప్రకంపనలు ఆయా దేశాల సరిహద్దు ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. టిబెట్ లో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన వినాశనం నుంచి కోలుకోకముందే, కొద్దిగంటల వ్యవధిలో మళ్లీ వరుసగా ప్రకంపనలు రావడం ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన పెంచింది. టిబెట్ భూకంపంలో 16 మంది మరణించిన విషయం తెలిసిందే.

- పాకిస్తాన్లో ఈ తెల్లవారు జామున 4:56 నిమిషాలకు భూమి ప్రకంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9 గా రికార్డయింది. 28.919 అక్షాంశం, 64.678 రేఖాంశం పరిధిలోకి వచ్చే పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఛాగై జిల్లాలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
- అనంతరం ఆఫ్ఘనిస్తాన్లో ఈ తెల్లవారు జామున 5:54 నిమిషాలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. రాజధాని కాబుల్ సమీపంలో 35.138 అక్షాంశం, 69.442 రేఖాంశం పరిధిలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది. ఉపరితలం నుంచి 68 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
- దాదాపుగా అదే సమయానికి అరుణాచల్ ప్రదేశ్ లోని పంగిన్ లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 32.492 అక్షాంశం, 93.618 రేఖాంశం పరిధిలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 15 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
- చైనాలో ఈ తెల్లవారు జామున 6:05 గంటలకు 4.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు టిబెట్ లో సంభవించిన భూకంప ప్రదేశానికి సమీపంలో ఉంటుందీ రీజియన్.
టిబెట్ భూకంపంలో ఇప్పటివరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 54 మందికి పైగా గాయపడ్డారు. భూకంప ధాటికి దాదాపు 339 నివాసాలు నేలమట్టం అయ్యాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో రవాణా దెబ్బతిన్నది. నేషనల్ హైవే 317పై వాహనాల రాకపోకలు స్తంభించాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.












Click it and Unblock the Notifications
