ఉలిక్కిపడ్డ కోల్‌కతా- భారీ భూకంపం: తీరంపై
కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. ఆ నగరాన్ని వణికించింది. బలమైన ప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడి, వెంటనే తమ ఇళ్ల నుండి బయటకు పరుగెత్తారు. దీని ప్రకంపనలు పొరుగు జిల్లాల్లోనూ కనిపించింది. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం ఎవ్వరూ తమ నివాసాలు, కార్యలయాల్లోనికి వెళ్లడానికి ఇష్టపడలేదు. రోడ్ల పైనే కాలం గడుపుతున్నారు. తీర ప్రాంతంపైనా దీని ప్రభావం పడింది.
రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం తీవ్రత 5.0గా నమోదైంది. దీని కేంద్ర బిందువు ఎక్కడ అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మిక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. బంగ్లాదేశ్ లో సంభవించిన 5.4 తీవ్రతతో కూడిన భూకంప ప్రభావం దీనికి కారణమైనట్లు చెబుతున్నారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు కొనసాగాయి. దీంతో ఎత్తైన భవనాలు, అపార్ట్ మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో ఉండే ప్రజలు తమ ప్రాంతాలను ఖాళీ చేశారు. రోడ్ల మీదికి పరుగులు పెట్టారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన కేంద్రమంత్రి సుకాంత మజుందార్ కోల్ కతలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో భూమి ప్రకంపించింది. దీంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఐఏఎన్ఎస్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. సుకాంత మజుందార్ ఒక సభలో మాట్లాడుతుండగా భూకంపం వచ్చినట్లు తెలిపింది.
ఎక్స్ వేదికగా చాలా మంది కోల్ కత నివాసితులు తమ అనుభవాలు తెలియజేశారు. సీలింగ్ ఫ్యాన్లు ఊగిపోవడం, ఫర్నిచర్ అటూ ఇటూ కదలడం, కిటికీలు కంపించడం వంటివి చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లల్లో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. తమ ఫ్లాట్ల నుంచి జనం పరుగులు తీశారు. ప్రకంపనల అనంతరం ప్రజలు వీధుల్లోకి గుమిగూడారు. ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ వేలాడుతున్న వస్తువులు, లైట్ ఫిక్చర్‌లు ఊగడం, ఒక ఇంట్లోని అక్వేరియం షేక్ అవడం వంటి దృశ్యాలు ప్రకంపనల తీవ్రతను కళ్ళకు కట్టాయి.
ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం, గాయాలు లేదా ప్రాణ నష్టం సంభవించలేదు. ఇటీవలే పశ్చిమ బెంగాల్ కు ఆనుకుని ఉన్న సిక్కింలోనూ వరుస ప్రకంపనలు భయాందోళనలు రేపిన విషయం తెలిసిందే. గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున సిక్కిం రాజధాని గాంగ్ టక్ సహా అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
ఈ తెల్లవారు జామున 4:10 నిమిషాలకు 3.7 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. 27.40 ఉత్తర అక్షాంశం, 88.69 తూర్పు రేఖాంశం వద్ద అయిదు కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. ఈ తెల్లవారు జామున ఈ ఘటనసంభవించగా.. కొన్ని గంటల వ్యవధిలో కోల్ కతలో అంతకు మించిన తీవ్రతతో భూమి ప్రకోపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications