వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంసాహారం, స్మార్ట్ ఫోన్ల వల్లే రేప్: బీహార్ మంత్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Eating non-vegetarian food makes one commit rape, says minister
హైదరాబాద్: దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మాంసాహారమే ప్రధాన కారణమని బీహార్ రాష్ట్ర మంత్రి వినయ్ బిహారీ రు సెలవిచ్చారు. బీహార్ రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన కళలు, సంస్కృతి, యువజన వ్యవహారాల శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

మాంసాహార స్వీకరణే అత్యాచారాలకు మూలకారణమని మంత్రిగారు చెప్పారు. మాంసాహారం తిన్న వ్యక్తికి అత్యాచారం చేయాలనిపిస్తుందని వినయ్ బీహారీ అభిప్రాయపడ్డారు. చికెన్, చేపలు తినే వ్యక్తుల్లో రేప్ ఆలోచనలు అధికంగా పురివిప్పుతాయని ఆయన అన్నారు.

మొబైల్ ఫోన్లు కూడా యువతను అత్యాచారాల బాటపట్టిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. యువత మొబైల్ ఫోన్లను బ్లూఫిల్ములు చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తోందని అన్నారు. అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా రేప్ కాంక్ష పెరిగిపోతుందన్న విషయాన్ని యువతకు విడమర్చాలని వినయ్ బీహారీ సూచించారు.

ఇంతకీ ఈ మంత్రివర్యులు భోజ్‌పురి సినిమా డైరక్టర్ మాత్రమే కాకుండా, ఫక్తు శాకాహరి కావడం గమనార్హం. యువత తమ మొబైల్ ఫోన్లలోని ఇంటర్నెట్‌ను విద్యను నేర్చుకోవడానికి ఉపయోగించడం లేదని, పోర్నోగ్రఫీ చూడడానికే ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు.

English summary

 In one of the most shocking statements on the increasing crime against women, Bihar minister for art, culture and youth affairs Vinay Bihari said, "People who eat more non-vegetarian food like chicken and fish are inclined towards carrying out molestation and rape".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X