అమెరికా కల సాకారానికి.. భారతీయులకు ఇదే బెస్ట్ వీసా

అమెరికా కలల సాకారానికి భారతీయులకు బెస్ట్ వీసాగా ఈబీ-5 వీసా ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్లు చెబుతున్నారు.

చండీగఢ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడ నివసిస్తున్న భారతీయుల్లో గుండెల్లో దడ పుట్టిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కలల సాకారానికి భారతీయులకు బెస్ట్ వీసాగా ఈబీ-5 వీసా ఉన్నట్టు అమెరికా ఇమ్మిగ్రేషన్ లాయర్ చెప్పారు.

అమెరికాలో గ్రీన్ కార్డు పొందాలనుకునే వారికి ఈబీ-5 వీసా ఒక ఆశాకిరణమని అమెరికా ఇన్వెస్ట్ మెంట్ ఇమ్మిగ్రేషన్ అటార్నీ వాఘన్ డీ కిర్బీ తెలిపారు. ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ సంస్థ విజయవంతంగా 1,300 ఈబీ-5 అప్లికెంట్లను కలిగి ఉందని చెప్పారు.

EB-5 visas best bet for Indians: US attorney

ఈ ప్రోగ్రాం ద్వారా అమెరికాలో పెట్టుబడులు పెడితే చాలు సదరు వ్యక్తి, అతని కుటుంబంతో సహా జీవితకాలం అమెరికాలోనే ఉండొచ్చని తెలిపారు. అయితే వారి పిల్లల వయసు మాత్రం 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండాలని చెప్పారు.

మరో విషయం ఏమిటంటే.. ఈ ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ప్రొగ్రాం గడువు కూడా 2017 సెప్టెంబర్ 30తో ముగుస్తోంది. ఈ వీసా ప్రొగ్రాం కింద అప్లికెంట్ అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తేనే గ్రీన్ కార్డు పొందుతారు.

అదేవిధంగా శాశ్వత గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా 10 మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. భారతీయులకు ఈ కేటగిరీ వీసా ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 18 నెలలే పడుతుందని ఇమ్మిగ్రేషన్ లాయర్ కిర్బీ చెప్పారు.

కొంతకాలంగా ట్రావెల్ బ్యాన్, హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు కారణంగా ఈబీ-5 వీసా తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి, పనిచేయడానికి, ఈబీ-5 వీసానే సరియైనది కిర్బీ చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+