ఫేక్ ఓటర్లకు షాక్! ఆధార్-ఓటరు కార్డ్ అనుసంధానంపై ఈసీ కీలక ప్రకటన
దేశంలో ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరో వైపు, నకిలీ ఓటర్లు పెద్ద సమస్యగా మారింది. ఒక్కరికే రెండు చోట్ల ఓటర్ ఐడీ కార్డులు ఉండటం కూడా గందరగోళానికి తావిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన సమావేశంలో ఆధార్‌తో ఓటర్ కార్డు అనుసంధానంపై కీలక ప్రకటన చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోపడి ఈ అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇందుకోసం యూనిక్ ఐడెటిఫికేషన్ అధారిట ఆఫ్ ఇండియా (UIDAI), ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభం అవుతాయని ఈసీ తన ప్రకటనలో పేర్కొంది.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సందు, వివేక్ జోషీలు మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి, న్యాయమంత్రిత్వశాఖ లెజిస్లేచర్ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవోతో పాటు ఈసీ సాంకేతిక నిపుణులతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం.. భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. అయితే, ఆధార్ కేవలం వ్యక్తిగత గుర్తింపును మాత్రమే నిర్ధారించగలిగే డాక్యుమెంట్. అందుకే ఓటర్ల గుర్తింపు కార్డ్ (EPIC)ని ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 36, ప్రజాప్రాతినిథయ చట్టం 1950లోని సెక్షన్లు 23(4), 23(5), 23(6) నిబంధనలు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. యూఐడీఏ, ఈసీ టెక్నికల్ నిపుణుల మధ్య చర్చలు త్వరలోనే ప్రారంభం అవుతాయని ఈసీ వెల్లడించింది. ఇక, ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానం జరిగితే నకిలీ ఓటర్ల సంఖ్య గణనీయంగా దాదాపు పూర్తిగా తగ్గే అవకాశం ఉంది.
ఆధార్ డేటాబేస్‌తో ఓటర్ల జాబితాలను స్వచ్ఛందంగా సీడింగ్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. ఎన్నికల చట్టాలు (సవరణ) చట్టం, 2021 ద్వారా సవరించిన ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 23, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు స్వచ్ఛంద ప్రాతిపదికన గుర్తింపును స్థాపించడానికి ఇప్పటికే ఉన్న లేదా కాబోయే ఓటర్లు ఆధార్‌ను అందించాలని కోరుతుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications